డాక్టర్ సుధాకర్ కేసును 8 వారాల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలతో నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ దూకుడు పెంచింది. హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన సీబీఐ శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. శనివారం మానసిక ఆస్ప త్రిలో చికిత్స పొందుతున్న సుధాకర్‌ను విచారించింది. ఈ సందర్భంగా సుధాకర్ ఆరోగ్య స్థితిని అడిగి తెలుసుకుంది. ఆయన వాంగ్ములాన్ని నమోదు చేసింది. విషయం తెలుసుకున్న సుధాకర్ తల్లి, కుమారుడు మానసిక ఆసుపత్రికి చేరుకుని సీబీఐ అధికారులను కలిసారు. వీరిద్దరి నుంచి కూడా సీబీఐ అధికారులు వాంగ్ములాన్ని నమోదు చేశారు. సుధాకర్ ఫిర్యాదు మేరకు కొందరు ప్రభుత్వ అధికారులు, పోలీసులు, మరికొందరి పై 120 బి, 324, 343, 379, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నేర పూరిత కుట్ర, కావాలని దూషించడం, మూడు రోజులకు పైగా అక్రమ నిర్బంధం, దొంగతనం, బెదిరింపులకు పాల్పడ్డారంటూ వీరిపై సీబీఐ ఎస్సీ పుట్టా విమలాదిత్య కేసు నమోదు చేశారు.

ఇదిలా ఉండగా డాక్టర్ సుధాకర్ కేసుకు సంబంధించి వైద్యుల పాత్రపై సీబీఐ ఆరా తీస్తోంది. నాల్గవ పట్టణ పోలీసులు సమర్పించిన ఆధారాల నేపధ్యంలో కేజీహెచ్ వైద్యులు సకాలంలో స్పందించారా, మానసిక వైద్యాలయానికి ఎందుకు పంపించాల్సి వచ్చింది అనే విషయాల పై ఇద్దరు అధి కారులు ఇప్పటికే కేజీహెచ్ వర్గాలను విచారించినట్టు తెలుస్తోంది. ఘటన జరిగిన తరువాత డాక్టర్ సుధాకర్‌ను కేజీహెచ్ డాక్టర్ల బృందం పరీక్షలు చేయాల్సి ఉండగా అలా జరగలేదని అప్పటికప్పుడు సుధాకర్ ను ఆసుపత్రికి రిఫర్ చేయడంలో లీగల్ గా వ్యవహరించారా అన్న కోణంలోనూ ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఈకేసు విషయంలో తమ తప్పేమీ లేదని నిరూపించుకునేందుకు అటు హాస్పిటల్ సిబ్బంది, ఇటు పోలీసులు తగిన ఆధారాలతో వస్తున్నట్టు తెలుస్తుంది. మరి సిబిఐ ఏమి తెల్చుతుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read