తెలుగుదేశం పార్టీ 38వ మహనాడు, ఆన్లైన్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు రెండో రోజు కూడా మహనాడు ప్రారంభం అయ్యింది. ఈ రోజు మహానాడులో మొదటిగా, హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో, ఎన్టీఆర్ తనయుడు, నందమూరి బాలకృష్ణ మాట్లాడారు. బాలకృష్ణ మాట్లాడుతూ, కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడున్న ప్రభుత్వం, మనల్ని ఎలా ఇబ్బంది పెడుతుందో చూస్తున్నాం, మాములుగా అయితే 5 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉంటుంది, కాని ప్రజలు 5 ఏళ్ళు భరించే పరిస్థితిలో లేరు, చాలా తొందరగానే, ఈ ప్రభుత్వం దిగిపోతుంది. నేను మరోసారి చెప్తున్నా, 5 ఏళ్ళు అవసరం లేదు, తొందరోనలోనే ఈ ప్రభుత్వం నుంచి విముక్తి లభిస్తుంది అంటూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఇది రాజకీయ కోణంలో, చేసారా , లేక జరుగుతున్న పరిస్థితులు, ప్రజలు విసిగెత్తి పోవటం, కోర్టుల్లో ఎదురు దెబ్బలు, కేంద్రం ఆగ్రహం, ఇవన్నీ రోజు రోజుకీ ఎక్కువ అయిపోతు ఉండటంతో, అన్నీ అలోచించి వ్యాఖ్యలు చేసారో కాని, బాలకృష్ణ వ్యాఖ్యల ఆసక్తికరంగా మారింది.

బాలయ్య మాట్లాడుతూ, ‘‘ఏ దేశమేగినా, ఎందు కాలిడినా, పొగడరా నిండు భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం...’’ గేయాన్ని గుర్తు చేసిన నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్ జయంతి ప్రతి తెలుగువాడికి పండుగ రోజు. ఎందరో పుడతారు, గిడతారు, కానీ మహానుభావులు కాలేరు. తన ఆదర్శాలను మాటల్లో కాకుండా చేతల్లో చూపిన వ్యక్తి ఎన్టీఆర్. తెలుగుజాతి నిర్వీర్యమై దిక్కుతోచని స్థితిలో మద్రాసీలుగా పిలువబడే పరిస్థితుల్లో ఎన్టీఆర్ తెలుగువారికి గుర్తింపు తెచ్చారు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు ద్వారా తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు పెంచారు. నటన అంటే నటించడమే కాదు సజీవ పాత్రపోషణకు నాంది పలికారు ఎన్టీఆర్. ఎన్ అంటే నటనాలయం. టి అంటే తారక మండలం. ఆర్ అంటే రాజర్షి, రాజకీయ దురంధరుడు. తెలుగు అనే 3అక్షరాలు వింటే నా తనువు పులకరిస్తుంది. ఎన్టీఆర్ అనే 3అక్షరాలు వింటే నా మనసు పులకరిస్తుంది. ఇది ప్రతి తెలుగువాడి భావన. తన కుటుంబానికి, తన భాషకు, తన జాతికి, తన రాష్ట్రానికి ఎనలేని గుర్తింపు తెచ్చారు.

ఒక చారిత్రాత్మక పురుషుడు ఎన్టీఆర్. సినీ జీవితాన్ని వదిలేసి ప్రజల కోసం టిడిపి స్థాపించారు. కనీస అవసరాలైన కూడు-గుడ్డ-నీడ అవసరాలు తీర్చారు. ఆడబిడ్డలకు ఆస్తిహక్కు కల్పించారు. పేదలంతా ప్రతిరోజూ పండుగ భోజనం( తెల్లన్నం)తినేలా చేశారు. నాకు ఎన్టీఆర్ తండ్రిమాత్రమే కాదు. గురువు, దైవం. ఎన్టీఆర్ ను తలుచుకుంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆయనను అనుకరించడం కాదు, అనుసరించాలి. అనుకరించేవాడు వారసుడు కాదని ఎన్టీఆర్ అనేవారు. నేను కాదు ఎన్టీఆర్ వారసుడిని, టిడిపి కార్యకర్తలంతా ఎన్టీఆర్ వారసులే. ఎన్టీఆర్ స్ఫూర్తితో టిడిపి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం. రాయలసీమకు నీళ్లు వస్తున్నాయంటే అది ఎన్టీఆర్ మస్తిష్కంలో ఆలోచనే. ఎన్టీఆర్ కలను నిజం చేసింది చంద్రబాబు. హిందూపురం శాసన సభ్యుడిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యకర్తల పార్టీ తెలుగుదేశం. టిడిపికి ఉన్న కార్యకర్తలు మరే పార్టీకి లేరు. నా తుది రక్తపు బిందువు వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే నా జీవితం అంకితం. తెలుగుదేశం పార్టీ సేవకే నా జీవితం అంకితం. ఈ అరాచక పాలన అంతానికి 5ఏళ్లు అవసరం లేదు. ప్రజలే అరాచకశక్తులకు తగిన బుద్ది చెబుతారు" అని బాలయ్య అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read