ఏకంగా ఎన్నికల కమీషనర్ నే తప్పిస్తూ, జగన్ మోహన్ రెడ్డి వేసిన పిటీషన్ పై ఈ రోజు హైకోర్ట్ తీర్పు ఇచ్చింది. రెండు వారాల క్రితం ఈ కేసు పై, విచారణ జరిగింది. వాదనలు పూర్తి అవ్వటంతో, నిమ్మగడ్డ కేసు తీర్పుని హైకోర్ట్ రిజర్వ్ లో పెట్టింది. ఈ రోజు, దీని పై తుది తీర్పుని ప్రకటించింది హైకోర్ట్. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపునకు ఉపయోగించిన ఆర్డినెన్స్ కోర్ట్ కొట్టేసింది. వెంటనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ విధుల్లో చేరాలని ఆదేశించింది. అలాగే నిమ్మగడ్డ ని తొలగిస్తూ ఇచ్చిన జీవో, కొత్త ఎన్నికల కమీషనర్ ని నియమిస్తూ ఇచ్చిన జీవో కొట్టేసింది. అలాగే రమేష్ కుమార్ తన పూర్తీ కాలం పదవిలో ఉండవచ్చు అని చెప్పింది. ఈ తీర్పుతో, ఈ క్షణం నుంచి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమీషనర్ గా కొనసాగనున్నారు.

మార్చ్ నెలలో, స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తూ, అప్పటి రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రక్రియ నామినేషన్ల వరకు వెళ్ళింది. అయితే ఆ ప్రక్రియలో అధికార పార్టీ హింస, బలవంతంగా నామినేషన్లు ఉపసంహరించుకోవటం, ఇలా అనేక ఘటనలు జిరిగాయి. ఎప్పుడూ లేనన్ని ఎకగ్రీవాలు అయ్యాయి. ఇలా నడుస్తూ ఉండగానే, రాష్ట్రంలో కరోనా విజ్రుంభించింది. దీంతో కరోనా ఎక్కువ అవుతూ ఉండటంతో, రమేష్ కుమార్ కేంద్రంతో చర్చించి, స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే దీని పై జగన్, ఆయన మంత్రులు అభ్యంతరం చెప్తూ, బూతులతో, కులం పేరు పెట్టి దూషిస్తూ విరుచుకు పడ్డారు. చంద్రబాబు ఏజెంట్ అంటూ మాట్లాడారు.

ఈ క్రమంలోనే, తనకు రక్షణ కావాలి అని, కేంద్ర హోం శాఖకు రమేష్ కుమార్ లేఖ రాసారు. దానికి తగ్గట్టే కేంద్రం కూడా, భద్రత పెంచింది. అయితే ఎలాగైనా ఎన్నికలు నిర్వహించాలి అనే తలంపుతో ఉన్న ప్రభుత్వ పెద్దలు, తమకు అడ్డుగా ఉన్న రమేష్ కుమార్ ని తప్పించటానికి, ఆర్డినన్స్ తీసుకు వచ్చారు. ఈ ఆర్డినన్స్ తో, రమేష్ కుమార్ పదవి పోయింది. ఆ ఆర్డినన్స్ కూడా గంటల్లో ఆమోదం పొందింది. తరువాత మరో కొన్ని గంటల్లోనే, తమిళనాడు నుంచి జస్టిస్ కనకరాజ్ ను తీసుకు వచ్చి, ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ మొత్తం పరిణామాల పై, రమేష్ కుమార్ సహా 12 మంది హైకోర్ట్ కు వెళ్ళారు. ప్రభుత్వం కక్షతోనే ఇలా వివాహరించింది అని, ఒకసారి ఎలక్షన్ కమీషనర్ ని నియమించిన తరువాత, రాష్ట్రానికి తప్పించే అవకాసం లేదని, వాదించారు. అలాగే ప్రభుత్వం కూడా తమ వాదన వినిపించింది. అయితే కోర్ట్ ఒప్పుకోలేదు, ఆర్డినెన్స్ కొట్టేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read