కరోనా మహమ్మారితో, ప్రపంచం అంతా, లాక్ డౌన్ అయిపొయింది. అమెరికా లాంటి చోట్ల కూడా, అందరూ తలో చేయి వేసి, దాతలు సహాయాలు చేస్తే కాని, గడవలేని పరిస్థితి. మన దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు లేవని, సహాయం చెయ్యమని కోరుతున్నారు. దాతలు ముందుకు వచ్చి, సహాయం చెయ్యాలని కోరుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రధాని నరేంద్ర మోడీ కూడా, ఇదే విషయన్ని చెప్పారు కూడా. ఈ క్లిష్ట సమయంలో, అందరూ ఒకరికొకరు సహాయంగా ఉండాలని కోరుతున్నారు. అందరూ చేతనైన సహాయం చేస్తున్నారు కూడా. ఎక్కడిక్కడ దాతలు పెద్ద ఎత్తున వచ్చి, సహయం చేస్తున్నారు. మన రాష్ట్రంలో, ప్రభుత్వం కంటే, అత్యధింగా దాతలు సహాయం చేస్తున్నారని, ఒక రిపోర్ట్ కూడా ఈ మధ్య విడుదల అయ్యింది. అలాగే, మిగతా రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సహాయం చేస్తుంటే, ఆర్ధిక పరిస్థితి బాగోలేదు కాబట్టి, తక్కువ సహాయం చేస్తున్నామని, ప్రభుత్వమే చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం.

అలాంటిది, ఎంతో విలువైన సహాయం, ఒక సీనియర్ తెలుగుదేశం నాయకుడు చేసారని, దాన్ని తిప్పి పంపించే పరిస్థితి వచ్చింది. ఎప్పుడు కరోనా వస్తుందో, ఎప్పుడు పోతామో తెలియని పరిస్థితిలో ఈ రోజు ఉన్నా కూడా, ఇప్పుడు కూడా రాజకీయం ఆడుతున్నారు. కరోనా వైరస్ మహమ్మారితో పోరాటంలో భాగంగా, 12 వేల లీటర్ల సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని, అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపాలిటీలోనూ, అలాగే తన నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో పిచికారి చేసే విధంగా, మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు నిర్ణయం తీసుకున్నారు. దీని కోసం, ముందుగానే, అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అనుమతి తీసుకున్నారు. శుక్రవారం ప్రత్యేక ట్రక్కు లో, సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని రాయదుర్గం నియోజకవర్గానికి తెప్పించారు.

దీన్ని స్థానికంగా ఉన్న రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ కు అందచేయాలని, తన అనుచరులు అయిన, టిడిపి నాయకులు గాజుల వెంకటేసులు, టంకశాల హనుమంతు, పసుపులేటి రాజు, బండి చిన్నను మున్సిపల్ ఆఫీస్ కు పంపించారు. ఈ లోడ్ ని, కమీషనర్ దృష్టికి తీసుకెళ్లి ద్రావణాన్ని, తగిన విధంగా వాడుకోవాలని కోరారు. అయితే, ఏ సంగతి చెప్తాను అని చెప్పిన కమీషనర్, మూడు గంటలు అయినా తిరిగి రాలేదు. అయితే ఏమైందో ఏమో కానీ, కొద్ది సేపటి తరువాత, ఇది మాకు అక్కరలేదంటూ నోటీసులు ఇచ్చి ట్రక్కు డ్రైవర్ ను వెనక్కి వెళ్లి పోవాలని రాయదుర్గం సిఐ తులసీరాం ద్వారా ఆదేశాలు జారీచేశారు. అయితే, ఈ పరిణామం పై, విమర్శలు వస్తున్నాయి. ఇలా ముందుకు వచ్చిన దాతలని, రాజకీయం నెపంతో, వెనక్కు పంపటం పై విమర్శలు వస్తున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read