రెండు రోజుల క్రితం, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, మేము దక్షిణ కొరియా నుంచి, స్పెషల్ ఫ్లైట్ లో, లక్ష కరోనా టెస్టింగ్ కిట్లు తెప్పించాం అని, దక్షిణ కొరియా నుంచి నేరుగా కొన్నాం అనే విధంగా, స్పెషల్ ఫ్లైట్ లో తెచ్చాం అంటూ, ప్రచారం చేసారు. ఈ ప్రచారాన్ని తారా స్థాయికి తీసుకు వెళ్తూ, మార్గాదర్శకాలు పక్కన పెట్టి మరీ, జగన్ మోహన్ రెడ్డి కూడా టెస్టింగ్ చేపించుకుని, మేము తెచ్చిన కిట్లు ఇవీ అంటూ, విస్తృత ప్రచారం చేసారు. అయితే, కిట్లు తేవటం మంచిదే కదా, అని అందరూ అనుకున్న సమయంలో, ఛత్తీస్‌గఢ్ వైద్య ఆరోగ్య మంత్రి టి.ఎ్‌స.సింగ్ దేవ్ చేసిన ట్వీట్ తో, అసలు బండారం బయట పడింది. కరోనా టెస్టింగ్ కిట్ల విషయంలో, ఏపి ప్రభుత్వం ఎక్కువ రేట్లు పెట్టి, కొనుగులు చేసినట్టు, ఆరోపణలు వచ్చాయి. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కూడా కొరియా నుంచి, ఇదే ప్రోడక్ట్, ఇదే కంపెనీ నుంచి, రూ.337కే కొనుగోలు చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం, దీనికి రెట్టింపు రేటు పెట్టి మరీ, రూ.700కు పైగా ఖర్చు చేసి కొనుగోలు చేసినట్టు బయట పడింది.
ఇక ఇక్కడ మరో విషయం ఏమిటి అంటే, "Random Medicaids Private Limited" అనే కంపెనీ కొరియా నుంచి సప్లై చేసింది అని ప్రెస్ కి చెప్పారు. అయితే బయట పడిన పర్చేజ్ ఆర్డర్ లో, "సండోర్ మెడీసైడ్స్ ప్రైవేటు లిమిటెడ్" అనే పేరు మీద ఉండటం, అలాగే, కొరియా నుంచి వచ్చిన కిట్లు, "Random Medicaids Private Limited" అనే కంపెనీ ద్వారా తెప్పించినట్టు, ఆ కంపెనీ డైరెక్టర్ మురళీధర్, సియంకు అందచేసినట్టు చెప్పారు. నిజానికి ఆ కంపెనీ పేరు, "సండోర్ మెడీసైడ్స్ ప్రైవేటు లిమిటెడ్", ఆ కంపెనీ డైరెక్టర్ పూర్తీ పేరు, వెంకట మురళీధర్ రెడ్డి అని తరువాత తేలింది. ఇలా ప్రభుత్వం ఈ వివరాలు పై గందరగోళం సృష్టించటంతో, తెలుగుదేశం, బీజేపీ పార్టీలు, ఈ విషయం జగన్ స్కాం చేసారని, ఆరోపణలు గుప్పించాయి. నిన్న ఉదయం దీని పై స్పందించిన ప్రభుత్వం మేము 700 రూపాయలకు కొన్నామని చెప్పగా, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి మాత్రం రూ.640 కొన్నామని అన్నారు. ఇలా పరస్పర విరుద్ధ ప్రకటనలు వచ్చాయి.
అంతే కాదు, మా పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, లీగల్ ఆక్షన్ తీసుకుంటామని, వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇలా ఉదయం నుంచి జరుగుతూ ఉండగా, నిన్న సాయంత్రం, ప్రభుత్వం మరో వివరణ ఇచ్చింది. "సండోర్ మెడీసైడ్స్ ప్రైవేటు లిమిటెడ్" అనే కంపెనీకి ఉత్తరం రాస్తూ, మాకు కూడా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కొనుగోలు చేసిన రేటు రూ.337కే ఇవ్వాలని లేఖ రాసింది. మొత్తం డెలివరీ తీసుకున్న తరువాత కూడా, మేము వారితో బెరం ఆడుతున్నాం, రేటు ఇంకా తగ్గుద్ది అని, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఇచ్చిన రేటుకే కొంటాం అని చెప్పారు. ఇది మా కాంట్రాక్టు లో కూడా ఉందని, ఎక్కడ తక్కువ రేటుకి ఇస్తే, మాకు అదే రేటుకు ఇవ్వాలని కోరినట్టు ప్రభుత్వం చెప్తుంది. అయితే, డెలివరీ తీసుకున్న తరువాత, బెరం కుదురుతుందా ? అలాగే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం డైరెక్ట్ గా దక్షిణ కొరియాలోని ఆ కంపెనీ నుంచి తెప్పించుకుంటే, మన ప్రభుత్వం మాత్రం, మరో మధ్యవర్తి, హైదరాబద్ కంపెనీ ద్వారా తెప్పించుకోవటంతోనే, ఈ రేటు ఇలా పెరిగింది అని, దీని వెనుక ఉన్నది కేంద్రం విచారణ చెయ్యాలని, విపక్షాలు కోరుతున్నాయి. ప్రభుత్వం నిన్న రాసిన లేఖతో, తామే డబల్ రేటు పెట్టి కొన్నాం అని ఒప్పుకుని, ఇప్పడు బయట పడటంతో, తప్పక రేటు తగ్గించేలా చూస్తాం అంటుందని, ప్రభుత్వమే తప్పు ఒప్పుకుందని, విపక్షాలు ఆరోపిస్తున్నాయి.