ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, హైకోర్ట్ లో షాకులు మీద షాకులు తగులుతున్నాయి. మొన్న, తెలుగు మీడియం పూర్తిగా ఎత్తేసి, తల్లిదండ్రులకి, పిల్లలకు ఛాయస్ ఇవ్వకుండా, బలవంతంగా ఇంగ్లీష్ మీడియం వైపు వెళ్ళాలి అంటూ, ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులని కోర్ట్ కొట్టిసిన సంగతి తెలిసిందే. అంతకు ముందు కూడా, 52 సార్లు హైకోర్ట్ లో ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఇలా ప్రతి విషయంలోనూ, రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా, అవగాహనా రాహిత్యం, దూకుడుగా వెళ్ళటంతోనే, ఇలాంటి ఎదురు దెబ్బలు తగులుతున్నాయిని చెప్పవచ్చు. తాజాగా ప్రభుత్వ భవనాలకు, వైసీపీ రంగుల విషయంలో, ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే ఈ విషయంలో, హైకోర్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసి, వెంటనే రంగులు మొత్తం తొలగించాలి అంటూ, చెప్పిన విషయం తెలిసిందే.
అయితే ఆ తీర్పు ఇచ్చిన సందర్భంగా, పది రోజుల్లోగా, రంగులు తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇప్పటికే ఆ ఆదేశాలు ఇచ్చి, రెండు నెలలు అవుతూ ఉండటంతో, ఇప్పుడు ప్రభుత్వం కోర్ట్ కు సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. కోర్ట్ పది రోజులు టైం ఇచ్చినా రంగులు తొలగించలేదు. దీంతో, ఇప్పుడు హైకోర్ట్ కి ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. తమకు రంగులు తొలగించటానికి మూడు నెలలు సమయం కావాలని, ప్రభుత్వం కోర్ట్ కు తెలిపింది. తమకు మూడు నెలలు సమయం ఇస్తే, రంగులు అన్నీ మార్చేస్తాం అని కోర్ట్ కు ప్రభుత్వం చెప్పింది. అయితే, ప్రభుత్వ స్పందన పై హైకోర్ట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
రంగులు మార్చటానికి మూడు నెలలు కావాలా ? మీ తీరు చూస్తుంటే, స్థానిక ఎన్నికలు అయ్యే వరకు, ఈ రంగులు ఇలాగే ఉంచాలి అనే ఆలోచనలో ఉన్నట్టు ఉన్నారు. సరే, మీరు కోరినట్టే మూడు నెలలు గడువు ఇస్తాం, అప్పటి వరకు, స్థానిక సంస్థలు ఎన్నికలు జరపకుండా మీరు ఉంటారా ? అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్ట్. రంగులు తొలగించటానికి, అంట సమయం ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. లాక్ డౌన్ ముగిసిన తరువాత, వేసిన రంగులు అన్నీ తొలగించటానికి, ఎంత సమయం పడుతుందో, అధికారులు దగ్గర సమాచారం తెలుసుకుని చెప్తామని, దానికి కొంత సమయం కావాలని, ప్రభుత్వం కోర్ట్ ను అభ్యర్థించగా, దానికి అంగీకారం తెలిపిన హైకోర్ట్, కేసును వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.