మాజీ ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ విషయంలో, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మొదటి నుంచి కుట్ర పూరితంగా, కక్ష పూరితంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా ఆయన ఎన్నికలు వాయిదా వేసారని, కక్ష కట్టి, వరుస పెట్టి, 60కి పైగా ప్రెస్ మీట్లు ఒక్క రోజులో పెట్టి, ఆయనకు కులానికి అంటగట్టి, తిట్టి పోశారు. తరువాత, ఆయన కరోనా సహాయం కోసం ప్రభుత్వం ఇచిన వెయ్యి రూపాయలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు, అందరికీ ఇస్తూ ఉండటాన్ని, విపక్షాలు ఈసీ దృష్టికి తేగా, దాని పై స్పందిస్తూ, కలెక్టర్లని ఆక్షన్ తీసుకోమని కోరారు. అంతే ఇక్కడ నుంచి కుట్ర మొదలైంది. ఆర్దినెన్స్ తేవటం, వెంటనే గవర్నర్ ఆమోదం పాడటం, ఆ వెంటనే రమేష్ కుమార్ ని తప్పిస్తూ రహస్య జీవో ఇవ్వటం, తరువాత కొత్త ఎన్నికల కమీషనర్ ను నియమించటం, ఇవన్నీ కొన్ని గంటల్లోనే జరిగిపోయాయి. చాలా వేగంగా, ఈ ప్రక్రియ అంతా కొనసాగింది. ప్రభుత్వం ఇంత వేగంగా, ఒక నిర్ణయం తీసుకుని, అమలు చెయ్యటం అంటే నిజంగానే వింత అనే చెప్పాలి.

ముఖ్యంగా ఈ నిర్ణయం వెనుక, అనేక వాదనలు ఉన్నాయి. ఏప్రిల్ 14 తరువాత లాక్ డౌన్ ఎత్తేస్తారని, వెంటనే ఎన్నికలు పెట్టేయాలని, అందుకే ప్రభుత్వం ఇలా చేసిందని అంటున్నారు. మరో పక్క ఎకగ్రీవాలు కూడా, రద్దు చేసే అవకాసం ఉందని, అందుకే హడావిడిగా కొత్త ఎన్నికల కమీషనర్ ని నియమించారు అనే వాదనలు కూడా ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఈ వ్యవహారం కోర్ట్ కు చేరింది. ఇలా ఆర్దినెన్స్ తెచ్చి మరీ, ఒక ఎన్నికల కమీషనర్ ను, ఆరోపణలు ఎదుర్కుంటున్న వారే తొలగించటం పై, అభ్యంతరాలు వస్తున్నాయి. అలాగే రాజ్యాంగానికి కూడా ఇది వ్యతిరేకం అని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే, ఈ కేసు హైకోర్ట్ వద్దకు చేరుకుంది. దీని పై హైకోర్ట్ స్పందిస్తూ, మూడు రోజుల్లోగా ప్రభుత్వాన్ని కౌంటర్ వెయ్యమంది.

నిన్నటితో మూడు రోజులు గడువు ముగుస్తుంది. అయితే, ప్రభుత్వం అనూహ్యంగా, కౌంటర్ దాఖలు చెయ్యలేదు. తమ వద్ద సరిపడా సిబ్బంది లేరని, అందుకే కౌంటర్ దాఖలు చేయ్యలేకపోతున్నామని అని అన్నారు. తమకు మరో రెండు రోజులు వరకు గడువు కావలి అంటూ, అడ్వకేట్ జనరల్, కోర్ట్ ని కోరారు. శనివారం సాయంత్రం లోపు కౌంటర్ దాఖలు చేస్తామని, కొత్తగా మరి కొన్ని వ్యాజ్యాలు దాఖలైన నేపథ్యంలో, తమకు సమయం కావాలని అన్నారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వ వాదన పై, విమర్శలు వస్తున్నాయి. ఒక పక్క రమేష్ కుమార్ ని తప్పించటానికి, కొన్ని గంటల్లో ఆర్దినన్సు, గవర్నర్ వద్ద ఆమోదం, జీవో ఇచ్చి మరీ, తప్పించిన ప్రభుత్వం, ఇక్కడ మాత్రం అఫిదివిట్ దాఖలు చెయ్యటానికి, మరి కొన్ని రోజులు కావాలి అని కోరటం గమనార్హం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read