ఒక పక్క క-రో-నా రాష్ట్రంలో విలయతాండవం చేస్తుంది. మరో పక్క ఆర్ధిక కష్టాలు, రాష్ట్రాన్ని కబళించి వేస్తున్నాయి. ఏడాదిగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో, చతికిలపడిన రాష్ట్ర ప్రగతి, కరోనాతో పూర్తిగా పడుకుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత, ఇప్పటికే 87 వేల కోట్లు అప్పు చేసింది. ఇక అప్పులు పెద్ద మొత్తంలో పుట్టాలి అన్నా, కష్టమయ్యే పరిస్థితి. కేంద్ర సహకారం అంతో ఇంతో ఉంది కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వానికి ఊపిరి ఆడుతుంది, లేకపోతే ఎప్పుడో చేతులు ఎత్తేసేది. ఇక మరో పక్క, కోర్టుల్లో ఎదురు దెబ్బలు. అనాలోచితంగా తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని కోర్టు తప్పు బడుతుంది. మరో పక్క ఎలక్షన్ కమీషనర్ వివాదం. మరో పక్క వివేక కేసు, డాక్టర్ సుధాకర్ కేసు సిబిఐకి ఇవ్వటం. మరో పక్క తనకు ఇష్టం లేని ఆఫీసర్లను సస్పెండ్ చేస్తున్నా, కోర్టు తీర్పులతో మళ్ళీ తిరిగి వస్తున్నారు. ఇంత గందరగోళం మధ్య రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. 151 సీట్లు వచ్చి రాజకీయంగా బలంగా ఉన్నా, అవగాహన లేమితో, అహంకార ధోరణితో, కోరి తెచ్చుకున్న కష్టాలు ఇవి.

ఇన్ని అవరోధాల మధ్య, కేంద్ర సహకారం కోసం, జగన్ మోహన్ రెడ్డి రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్ళటం, ఆసక్తి రేపుతుంది. కరోనా సహాయం కోసం, లేకపోతే మరో ఇతర సహాయాల కోసం అయితే, వీడియో కాన్ఫరెన్స్ లో, మాట్లాడవచ్చు. ఇప్పటికే ప్రధాని కాని, హోం మంత్రి కాని అలాగే మాట్లాడారు. అయితే రేపు జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి, అమిత్ షా ని కలుస్తారని, అలాగే న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ని కలుస్తారనే వార్తలు, వింటుంటే, ఇది కరోనా సహాయం కోసం కాదని, మరేదో ఉంది అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రధాని మోడి అపాయింట్మెంట్ కోసం చూస్తున్నారని, కాని మోడీని కలిసే అవకాశం లేదని తెలుస్తుంది. మరి ఇంత అర్జెంటుగా, ఢిల్లీ వెళ్లి, అమిత్ షా ని కలిసేది, రాష్ట్రానికి సహాయం కోసమా, ప్రత్యెక హోదా, విభజన హామీల కోసమా, లేక ఇంకా ఏదైనా ఉందా అనేది, రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇస్తే కాని, తెలిసే పరిస్థితి లేదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read