చట్టం, న్యాయం అనేది, ఎక్కడైనా ఒకటే, ఏ కోర్టుకైనా ఒక్కటే. జరిగిన తప్పు తెలుసుకోకుండా, చేసిన తప్పు చేస్తూ, మమ్మల్ని కోర్టులు తపు పడుతున్నాయి, లేకపోతే, ఎవరో మ్యానేజ్ చేసారు అని చెప్పి, గోల చెయ్యటం ఎంత వరకు సమంజసం. ఎవరైనా, నాది అధికారం అని చెప్పి, ప్రభుత్వ భవనాలకు, పార్టీ రంగులు వేస్తే, ఏ కోర్టు చూస్తూ ఊరుకుంటుంది. ఇప్పుడు అదే జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పంచాయతీ భవనాలకు రంగులు వేస్తూ ఇచ్చిన జీవోని, ఒకటికి రెండు సార్లు హైకోర్ట్ కొట్టేసిన సంగతి తెలిసిందే. దీని పై కోర్టు ధిక్కరణ కేసు కూడా హైకోర్టులో మొదలైంది. అయితే, దీని పై, ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లి అపీల్ చేసింది. ఈ రోజు సుప్రీం కోర్టు కూడా ఈ విషయం పై, విచారణ చేసి, రాష్ట్ర ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో హైకోర్టులోనే కాకుండా, సుప్రీం కోర్టులో కూడా, రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ప్రభుత్వ కార్యాలయాలకు 4 రంగులు వెయ్యటం సరికదాని కోర్టు స్పష్టం చేసింది. ఇవి పార్టీ రంగులు కాదని, ఇవి వేరే రంగులు అంటూ, ప్రభుత్వం చేసిన వాదన పై , సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ రంగులును నాలుగు వారాల్లో తొలగించాలని, సుప్రీం కోర్టు టైం ఇచ్చింది. హైకోర్టు చాలా స్పష్టంగా తీర్పు ఇచ్చిందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. నాలుగు వారాల్లో తీర్పు అమలు చేయకపోతే ధిక్కరణ కింద పరిగణించాల్సి ఉంటుంది అంటూ, సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఏపి ప్రభుత్వం వేసిన పిటీషన్ ను, సుప్రీం కోర్టు కొట్టేసింది. ఇప్పటికీ ఈ అంశం పై రెండు సార్లు, సుప్రీం కోర్టు ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. మేము కూడా మా సీజే ఫోటో సుప్రీం కోర్టు బయట పెట్టుకోమా ? కేంద్ర కార్యాలయాలు అన్నీ కాషాయం రంగు వేస్తే మీరు ఊరుకుంటారా అంటూ, సుప్రీం కోర్టు గతంలోనే, రాష్ట్ర ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు, హైకోర్టు చెప్పినా, ప్రభుత్వం మూడు రంగులకు, మరో రంగు జోడించి, రంగులు వేద్దాం అని ప్రయత్నం చేసి, మొన్న హైకోర్టు ఆగ్రహానికి, ఈ రోజు సుప్రీం కోర్టు ఆగ్రహానికి గురయ్యింది. ఇక ప్రభుత్వానికి, రంగులు తియ్యటం మినహా మరో ఆప్షన్ లేదు. లేకపోతే కోర్టు ధిక్కరణ కింద, ఆఫీసర్లు బుక్ అవుతారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read