తిరుమలలో స్వామివారి దర్శన భాగ్యాన్ని భక్తులకు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్వామి వారిని ఈ నెల8వ తేదీ నుంచి దర్శించుకునే భాగ్యాన్ని ప్రభుత్వం కల్పించింది. కరోనా వైరస్ ప్రభావంతో దాదాపు మూడు నెలల క్రితం తిరుమల దేవస్థానంలోకి స్వామివారి దర్శనార్ధం భక్తులను అనుమతించని పరిస్థితులున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా లాక్ డౌన్ నిబంధనల్లో అనేక సడలింపులు ఇచ్చాయి. ఈ క్రమంలో భక్తులకు స్వామివారి దర్శనార్దం అనుమతిని ఇవ్వాలని దేవస్థానం కార్య నిరవ్వహణాధికారి(ఈవో) ప్రభుత్వానికి లేఖరాసారు. భక్తులకు భౌతికదూరం పాటించే విధంగా, శానిటైజేషన్,థర్మల్ స్క్రీనింగ్ తదితరంశాలను పాటింపచేస్తూ దర్శనం కల్పిస్తామని లేఖలో ఈవో పేర్కొన్నారు. భక్తులు భౌతిక దూరం పాటించే విధంగా క్యూలైనులు ఏర్పాటుతో పాటుగా పలు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఈవో రాసిన లేఖకు స్పందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమలలో శ్రీవారి దర్శనానికి అనుమతించింది.
భక్తులను దర్శనానికి అనుమతించే ముందు తిరుమల, తిరుపతి దేవస్థానం ఉద్యోగులుతోను, స్థానికులతో ముందుగా ట్రయల్ రన్ నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతించింది. కనీసం 6 అడుగుల భౌతికదూరం పాఠిస్తూ దర్శనం కల్పిం చాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జె.ఎన్. వి. ప్రసాద్ ఉత్తర్వులు జారీచేసారు. భక్తులు దర్శనానికి లాక్ డౌన్ నిబంధనల సడలింపులో భాగంగా ప్రభుత్వం అనుమతిని కల్పించడంతో తిరుమల తిరుపతి దేవస్ధానం క్యూలైన్లులో మార్పు చేసింది. వరుసల్లో భక్తులు నిలిచే సమయంలో వారి మధ్య భౌతిక దూరం నిబంధనలకు అనుగుణంగా ఉండే విధంగా చర్యలు చేపట్టింది. గట్టిభద్రతా చర్యలు దాదాపు 75రోజుల తరువాత ఏడుకొండల వేంకటేశ్వరస్వామివారి దర్శనానికి అనుమతినివ్వడంతో భక్తుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈనెల 8వతేదీ నుంచి ప్రయోగాత్మకంగా తొలి సారిగా భక్తులను ఆలయంలోనికి అనుమతించి , ఇష్టదైవం దర్శనం కల్పించనుండటంతో కొన్ని నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకొంటున్నారు.
ప్రయోగాత్మక దర్శనంలో తొలుత టిటిడి ఉద్యోగులతో బాటు తిరుమల తిరుపతి స్థానికులకు అవకాశం కల్పించనుంది. ఇందుకోసం అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేశారు. భక్తులు తిరుమల ఆలయంలో ఆరడుగుల భౌతిక దూరం పాటిస్తూ, క్యూలైన్లో ముందుకు కదిలేలా కసరత్తు చేపట్టారు. తాజాగా మంగళవారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జెఎస్వి ప్రసాద్ ఉత్తర్వులు జారీచేయడంతో భక్తుల అనుమతికి అవకాశం లభించింది. కరోనా వైరస్ తగ్గు ముఖం వట్టినా ప్రముఖ వుణ్యక్షేత్రమైన తిరుమలకు భక్తులను అనుమతించి శ్రీవారి దర్శనం కల్పించే విషయంలో మాత్రం టిటిడి ఉన్నతా ధికారులు పక్కాగా నిబంధనలు పాటించను న్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన మార్పు లు వైకుంఠం-1 క్యూకాంప్లెక్స్ క్యూలైన్లలో చేప ట్టారు. తిరుమలకు భక్తులు రావడం దగ్గర నుంచి గదుల బుకింగ్, స్వామివారి దర్శనం కల్పిం చడం, లడ్డూ ప్రసాదాల పంపిణీ ఇలా ప్రతి విషయంపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు