ప్రభుత్వాలు తమ ఇష్టం వచ్చినట్టు చేస్తాయనే, ప్రభుత్వాలు కంటే, కోర్టులకు ఎక్కువ అధికారం ఇచ్చారు. ప్రభుత్వం తమకు బలం ఉంది అని, చేసే తప్పులను, కోర్టులు కరెక్ట్ చేస్తూ ఉంటాయి. హైకోర్ట్ కాని, తరువాత సుప్రీం కోర్ట్ కాని, ప్రభుత్వాలు చేసే తప్పులు సరి చేస్తూ ఉంటాయి. అయితే ప్రభుత్వాలు కూడా కోర్టులను గౌరవిస్తూ వస్తాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం, అందుకు భిన్నంగా, చిన్న చిన్న సాంకేతిక అంశాలు చూపించి, కోర్టు తీర్పులను పక్కన పెట్టి ముందుకు వెళ్తున్నారు. రంగుల విషయంలో ఇలాగే చేసారు. హైకోర్ట్, సుప్రీం కోర్ట్ కూడా, రంగులు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు బడితే, తమ పార్టీ మూడు రంగులకు, ఇంకో రంగు జోడించి, ముందుకు వెళ్లారు. దీంతో రెండో సారి కూడా హైకోర్ట్ ఆపేయమని చెప్పింది. ఇక ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పై కూడా ఇలాగే జరుగుతుంది. తెలుగు మీడియం ఆప్షన్ అనేది ఇవ్వకుండా, బలవతంగా ఇంగ్లీష్ మీడియం పెట్టటాన్ని హైకోర్ట్ కొట్టేసింది.
అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం, హైకోర్ట్ చెప్పినా, ఇంగ్లిష మెదిఉమ పై ముందుకే వెళ్తుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఒకటి నుంచి ఆరవ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ ఆం ధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మైనార్టీ, భాషా మాధ్యమం, పాఠశాలలు యధాతధంగా కొనసాగుతున్నాయి. వాటిల్లో విద్యార్థులు కోరుకుంటే అక్కడా సమాంతరంగా ఆంగ్ల మాధ్య మ తరగతుల్ని ప్రవేశ పెట్టనున్నారు. ప్రస్తుతం గత ప్రభుత్వ హయంలో పెట్టిన ఆంగ్ల మాధ్యమం అమలవుతున్న ప్రభుత్వం మున్సిపల్, మండల, జిల్లా పరిషత్ స్కూళ్ళు యథాతధంగా కొనసాగుతాయి. ఇక ఏడవ, ఎనిమిది, తొమ్మిది, పది తరగతులను క్రమేణా ఆంగ్ల మాధ్యమాలుగా మారుతున్నాయి. పాఠశాల విద్యలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపె ట్టాలనే అంశంపై విద్యా పరిశోధన శిక్షణ మండలి(ఎస్సీ ఈఆర్సీ) అధ్యయనం చేసి ఇచ్చిన నివేదికను అనుసరించి ప్రభుత్వం ఈ ఉత్తర్వులను జారీ చేసింది.
ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లి దండ్రులు వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఏ మాధ్యమంలో బోధన కోరుకుంటున్నారో ఆప్షన్ ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ గతంలో కోరింది. ఇందుకు మూడు ఆప్షన్లు కల్పించింది. తెలుగు తప్పని సరి సబ్జెక్టుగా ఉంటూ ఆంగ్ల మాధ్యమంలో బోధన, తెలుగు మాధ్యమంలో బోధన, ఇతర మాతృభాషల్లో బోధనలో ఎంచుకునే అవకాశాన్ని తల్లిదండ్రులకు ఇచ్చారు. దాంతో మొత్తం 17,97,168మంది నుంచి ఆప్షన్లు రాగా, వారిలో 53,943 మంది తెలుగు మాధ్యమంలో బోధన కోరుకున్నారని ప్రభుత్వం తెలిపింది. ఈ విద్యార్థుల కోసం ఆయా పాఠశాలల్లో తెలుగు మాధ్యమం తరగతుల ఏర్పాటు పాలనా, ఆర్థికపరంగా సాధ్యం కాదు గనుక గతంలో ఇచ్చిన జీవో 15 ప్రకారం ప్రతి మండల కేంద్రంలో అంటే 672 మండలాల్లో ఒక తెలుగు మాధ్యమ పాఠశాలను కొనసాగిం చనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో వివరించింది. అయితే హైకోర్ట్ వద్దు అని చెప్పినా, ఇలా ముందుకు వెళ్ళటం పై, అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇలా ప్రతి విషయంలో కోర్టు నిర్ణయాలను వ్యతిరేకిస్తూ, ధిక్కరిస్తూ ముందుకు వెళ్తే, రాజ్యాంగ సంక్షోభం వచ్చే అవకాసం లేకపోలేదని చెప్తున్నారు.