విశాఖపట్నంలో, ఎల్జీ పాలిమర్స్ ఉన్న ఆర్ఆర్ వెంకటాపురం ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గ్యాస్ లీక్ బాధితులను పరామర్శించేందుకు ఆ గ్రామాలకు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు వచ్చారు. అయితే తెలుగుదేశం పార్టీ నేతలను వెంకటాపురంలోని అడుగు పెట్టనివ్వకుండా, పోలీసులు అడ్డుకున్నారు. మాజీ మంత్రి బండారు సత్యన్నారాయ మూర్తి, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీతో పాటుగా పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్ట్ చేసి పెందుర్తి పోలీసు స్టేషన్ కి తరలించారు. అనంతరం అక్కడ నుంచి ఆనందపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే, జరుగుతున్న ఈ పరిణామాల పై తెలుగుదేశం పార్టీ భగ్గు మంది. బాధితులను పరామర్శించటానికి వస్తే అడ్డుకువటం, అరెస్ట్ చెయ్యటం ఏమిటి అంటూ తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది. వైసీపీ మంత్రులు, అక్కడ గ్రామాలకు దూరంగా పడుకుని డ్రామాలు ఆడారని, అక్కడ ప్రజలు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

ఈ ఇబ్బందులు గురించి తెలుసుకోవటానికి, వెళ్తే అరెస్ట్ చెయ్యాల్సిన అవసరం ఏమి ఉంది అంటూ ప్రశ్నిస్తున్నారు. మొన్నటికి మొన్న, 12 మంది చంపిన కంపెనీ వారిని కాకుండా, న్యాయం చెయ్యాలి అని చెప్పిన బాధితుల పై కేసులు పెట్టటం, ఇప్పుడు బాధితులకు అండగా ఉందామని, తెలుగుదేశం పార్టీ నేతలు వస్తే అరెస్ట్ చెయ్యటం ఏమిటని తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది. ఇప్పటికీ అక్కడ ఊపిరి ఆడక ఇబ్బందులు పడుతున్నారని, నిన్న ఇద్దరు వాలంటీర్లు ఊపిరి ఆడక పడిపోవటం, కొంత మంది ఇళ్ళల్లో శుభ్రం చేసుకుంటూ, పడిపోవటం లాంటి సంఘటనలు చోటు చేసుకుంటుంటే, ప్రభుత్వం మాత్రం అంతా బాగుంది అని చెప్తూ, ఇక్కడ వాస్తవ పరిస్థితి చెప్పటం లేదు అంటూ, తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది.

ఇక మరో పక్క, ఈ రోజు, ఎల్జీ పాలిమర్స్ దగ్గర ఉన్న, వెంకటాపురం రైల్వేట్రాక్ సమీపంలో అంధకారం నెలకొంది. వీధి దీపాలు వెలగక స్థానికుల అవస్థలు పడుతున్నారు. స్టైరీన్ వాయువు పీల్చి మృతిచెందిన వారిలో ఎక్కువ మంది ఈ వెంకటాపురం ప్రాంతానికి చెందిన వారే అన్న సంగతి తెలిసిందే. వెంకటాపురం రైల్వేట్రాక్ సమీపంలో అంధకారం నేలకోనటంతో, స్థానికలు భయాందోళనకు గురి అవుతున్నారు. వెంటనే, వీధి దీపాలు వెలిగేలా చెయ్యాలని కోరుతున్నారు. ఇప్పటికీ భయం భయంగా గడుపుతుంటే, వీధి దీపాలు లేకుండా చెయ్యటం పై, వారు ఆందోళన వ్యక్తం చేస్తూ, వెంటనే అవి పునరుద్ధించాలని అక్కడ స్థానిక అధికారులను కోరుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read