లాక్ డౌన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుకాణాలు తెరిచేందుకు ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతులు ఇస్తూ, అదనపు మార్గదర్శకాలు జారీ చేసింది. కంటైన్మెంట్, బఫర్ జోన్లు మినహా, మిగతా అన్ని ఇతర ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దుకాణాలు తెరుస్తూ, వ్యపారాలు చేసుకునే వీలు కల్పించింది. కంటైన్మెంట్ జోన్లలో మాత్రం, ఎట్టి పరిస్థితిలోనూ దుకాణాలు తెరవ కూడదు అని, ఉల్లంఘిస్తే మాత్రం, కఠిన చర్యలు తీసుకుంటామని తమ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే పండ్లు, కూరగాయలు, పాల విక్రయాలు ఉదయం 6 నుంచి 11 వరకు మాత్రమే నిర్వహించుకోవచ్చని తెలిపింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్‌కు అనుమతి లేదని స్పష్టం చేసింది. వస్త్ర, బంగారు ఆభరణాలు, చెప్పుల దుకాణాలకూ అనుమతి లేదని తమ ఉత్తర్వుల్లో పేర్కొంది.
షాపింగ్ మాల్స్ కాని, మార్కెట్లు కాని, మార్కెట్ కాంప్లెక్స్ లు కాని, తెరిచే వీలు ఉండదు. పట్టణ ప్రాంతంలో కాని, గ్రామీణ ప్రాంతంలో కాని, ఎక్కడా ఈ షాపింగ్ మాల్స్ కాని, మార్కెట్లు కాని, మార్కెట్ కాంప్లెక్స్ లు తెరిచే వీలు ఉండదు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో, కాలనీల్లో ఉండే షాపులు, రెసిడెన్షియాల్ కాంప్లెక్స్ లో ఉండే షాపులు, తెరుచుకునే వీలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇక బట్టల దుకాణాలు కాని, బంగారం షాపులు కాని, చెప్పులు షాపులు కానీ, గ్రామీణ ప్రాంతంలో కాని, పట్టణ ప్రాంతంలో కాని, తెరవటానికి వీలు లేదు. అలాగే పట్టణ ప్రాంతంలో కూడా, కాలనీల్లో ఉండే షాపులు, రెసిడెన్షియాల్ కాంప్లెక్స్ లో ఉండే షాపులు, తెరుచుకునే వీలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
అలాగే పక్క పక్కన ఉండే షాపుల విషయంలో కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. నిత్యావసర వస్తువులు, మందులు, పాలు, కూరగాయలు షాపులు మినహా, మిగతా షాపుల విషయంలో, ఒక షాపు ఒక రోజు తెరిస్తే, మరో షాపు ఇంకో రోజు తెరవాలని, ఈ రకంగా, ఒక షాపుకు, ఇంకో షాపుకు దూరం ఉంటుందని, దీనికి సంబంధించి మునిసిపల్ అధికారులు ఆదేశాలు ఇస్తారని చెప్పింది. ఇక ఎక్కువ కేసులు ఉన్న మునిసిపల్ కార్పొరేషన్ల పరిధిలో, కేవలం నిత్యావసర వస్తువులు, కన్స్ట్రక్షన్ కు సంబందించిన షాపులు, వ్యవసాయానికి సబందించిన షాపులు, స్పేర్ పార్ట్శ్ అమ్మె షాపులు మాత్రమే తెరుస్తారని చెప్పింది. అలాగే ప్రతి ఒక్కరికీ ఆరు అడుగుల దూరం ఉండాలని, షాపు ముందు మార్క్ పెట్టాలని, సానిటైజర్లు షాపులు ఉండాలని, మాస్కులు, గ్లవుజులు వేసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.