మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఈ రోజు మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్ట్ 71 శాతం పూర్తయింది అని నిరూపిస్తే మీసం తీస్తా అంటూ ఛాలెంజ్ చేసారు, లేకపోతే నువ్వు తీస్తావా అంటూ ఎదురు దేవినేని ఉమాకు ఛాలెంజ్ చేసారు. ఇదే విషయం పై ఈ రోజు దేవినేని ఉమా మాట్లాడారు. "టీడీపీ హయాంలో ప్రతి సంవత్సరం కాటన్ జయంతి రోజున చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఇంజనీర్లను సత్కరించుకున్నాం. కాటన్ జయంతిని గుర్తు చేసుకునే తీరక కూడా లేదు జగన్మోహన్ రెడ్డికి. నీటిపారుదలశాఖ మంత్రేమో మీసాలు తీసేస్తామని చెబుతున్నారు. కాటన్, కేఎల్ రావు, విశ్వేశ్వరయ్య లాంటి వారిని భావితరాలు గుర్తుంచుకుంటారు. చంద్రబాబు గారి నాయకత్వంలో రూ. 63 వేల కోట్లకు పైగా పనులు చేసి సమగ్ర జలవిధానంతో ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు నీరు అందించాం. పోలవరంలో 70.82 శాతం పనులు జరిగాయని 19.5.2019 న అధికారులు ఇచ్చిన రిపోర్టును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి , ఇరిగేషన్ మంత్రి చూడాలి. ఎన్నికలు అనంతరం 26.5.2019న 71.13 పర్సెంట్ పనులు అయినట్టు అధికారులు రిపోర్ట్ ఇచ్చారు. ఇదే అధికారులు ఇప్పుడూ అప్పుడూ ఉన్నారు. 10.6.2019న 71.43 పర్సంట్ పనులయ్యాయి. మీ ప్రభుత్వంలో పోలవరం పనులు ఎంత వరకూ జరిగాయో మీ రివ్యూల్లోనే బాగా చూసుకోండి."

"ఎవరి మీసాలు ఎవరు తీసుకుంటారో, ఎవరి గడ్డాలు ఎవరు తీసుకుంటారో తేల్చుకోండి. మాట్లాడేప్పుడు బాధ్యతగా మెలగాలి. ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా నేను ప్రతి వారం పోలవరం సమాచారాన్ని ఆన్ లైన్ లో పెట్టి మీడియాకు ఇచ్చాను. మీరు ఎందుకు సమాచారం దాస్తున్నారు? అధికారంలోకి వచ్చి ఏడాదైనా పోలవరం ప్రాజెక్టు పనులు ఎంతవరకు పూర్తయ్యాయో ఎందుకు ఆన్ లైన్ లో పెట్టడం లేదు? ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది. పోలవరం పనులకు సంబంధించి ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత సమాచారాన్ని నేను మీడియా ముందు పెడుతున్నా. సిగ్గుతో తలవంచుకుంటారా మీరు? నోరు ఉందికదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడటం సరికాదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఐదేళ్లు మీ సాక్షిలో నోటికొచ్చినట్టు రాశారు. ఇవాళ ఏం చేస్తున్నారు మీరు? పోలవరం ప్రాజెక్టులో ఎంత కాంక్రీటు వేశారు ?ఎంత మట్టి తీశారో చెప్పమంటే సమాధానం చెప్పే దమ్ము లేక మీసాలు తీసుకుందాం రమ్మంటున్నాడు ఇరిగేషన్ మంత్రి. ఏం మాట్లాడుతున్నారు మీరు? రూ. 12,236 కోట్ల బడ్జెట్ పెట్టారు. ఈ 12 నెలల్లో ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు తీశారు? ఎన్ని బొచ్చిల కాంట్రీటు వేశారు. నెల్లూరు కట్టాం, సంగం కట్టామంటూ కబుర్లు చెబుతున్నారు. ఓ ఎమ్మెల్యే నీళ్లు అమ్ముకున్నారని ఆరోపణ వచ్చింది కాబట్టే నేను ప్రశ్నించాను"

"ఆరోపణలు చేసింది అధికార పార్టీ ఎమ్మెల్యే . ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. రూ. 12, 236 కోట్ల బడ్జెట్ లో ఎంత ఖర్చు పెట్టారో చెప్పండి. మీ రివర్స్ టెండరింగ్ ఎంతవరకు వచ్చింది . టీడీపీ హయాంలో సాగునీటి విజయాలపై పూర్తి సమాచారాన్ని నేను చెప్పగలను. సమగ్ర జలవిధానంతో ముందుకెళ్లాం. దేశానికి ఆదర్శంగా నిలిచాం. 19 స్కాచ్ అవార్డు తెచ్చాం. పోలవరం ప్రాజెక్టును దేశ చరిత్రలో పెట్టాం. సాగునీటి రంగంలో గుజరాత్ తర్వాత ఏపీని దేశంలో రెండో స్థానంలో నిలబెట్టాం. రివర్స్ టెండరింగ్ చేసి రివర్స్ పాలన చేసి మీరు ఏమి ఉద్దరించారు? గోదావరి-పెన్నా అనుసంధానం టెండర్లు పిలిచాం. పనులు జరుగుతున్నాయి. 11 నెలలుగా మీరు పనులను ఎందుకు పక్కన పెట్టారో చెప్పండి. వెలిగొండ టెన్నల్ పనులు ఎవరు మొదలుపెట్టించారు? ఎవరు వేగవంతం చేశారు? పోలవరం పనులు ఎందుకు ఆపేశారు? పోలవరం పవర్ ప్రాజెక్టును కోర్టుల్లో ఎందుకు పెట్టారో చెప్పండి? మీ ఘనకార్యాలు చెబితే వింటాము. 24 గంటలు ఆపకుండా కాంక్రీట్ వేయించాం. కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు మేము చేస్తే మీరేం చేశారు..పరిగెత్తే ప్రాజెక్టును కమీషన్ల కక్కుర్తితో ఆపేశారు. రూ. 500 కోట్ల రివర్స్ టెండరింగ్ డ్రామాలు ఆడారు. ఇసుకకే రూ. 500 కోట్ల ఫైల్ నడిపారు. సమగ్ర జల విధానంపై వైసీపీ స్టాండ్ ఏంటో చెప్పాలి. టీడీపీ హయాంలో ఏపీకి 19 స్కాచ్ అవార్డులు 670కి పైగా అవార్డులు, 2 గిన్నీస్ బుక్, 1 లిమ్కా అవార్డులు వచ్చాయి. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్దిని జీర్ణించుకోలేక ఎదురుదాడి చేస్తున్నారు. సమగ్ర జలవిధానంతో వెనకబడిన ప్రాంతాలకు నీరు తీసుకెళ్లాం. వేదావతి, గుండ్రేవుల పనులు ఆపాల్సిన అవసరం ఎందుకొచ్చిందో వైసీపీ సమాధానం చెప్పాలి." అని ఉమా అన్నారు.,

Advertisements

Advertisements

Latest Articles

Most Read