ఏ ప్రభుత్వం అయినా, కేంద్రం అయినా, రాష్ట్రం అయినా, ఇప్పుడు ఉన్న సహజ సంపద కాపాడి, భవిష్యత్తు తరానికి, బ్రతికే అవకాశం ఇవ్వాలి. అయితే, మైనింగ్ లాంటి విషయాల్లో, ఎలాగూ ప్రభుత్వాలు మన మాట వినవు. ఇక అడవులు కొట్టేయటం కూడా, అలాంటిదే. కాని ఇప్పుడు చివరకు, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములు, ప్రభుత్వమే అమ్మకానికి పెడితే ? మన రాష్ట్రంలో అదే జరుగుతుంది. గత ఏడాది కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, దాదాపుగా 80 వేల కోట్లు అప్పు చేసింది. చేసిన ఆ అప్పుతో, ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసిందా ? ఏదైనా ప్రాజెక్ట్ కట్టిందా ? ఎక్కడైనా రోడ్డు వేసిందా ? ఎక్కడైనా పంచాయతీ బిల్డింగ్ కాని, స్కూల్ కాని కట్టిందా అంటే లేదనే చెప్పాలి. రంగులు వెయ్యటం తప్ప, ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత చేసిన కొత్త పని ఏమి లేదు. మరి ఈ 80 వేల కోట్లు ఏమయ్యాయి ? మొత్తం సంక్షేమానికి ఖర్చు అయిపోయాయా ? అప్పు చేసి, ఎన్నాళ్ళు, ఇలా సంక్షేమం చేస్తాం ? ఆదాయం పెంచుకునే మార్గాలు చూడాలి కదా ?
ఇలాంటి మాటలు వినిపిస్తున్న టైంలోనే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భూములు అమ్మి, నెట్టుకురావటానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇంకా అప్పు ఎవరూ ఇవ్వరు అనుకున్నారో ఏమో, ఇలా భూములు అమ్మి, కాలక్షేపం చెయ్యటానికి రెడీ అయ్యింది ప్రభుత్వం. చంద్రబాబు 5 ఏళ్ళలో, ఒక లక్షా 6 వేల కోట్లు అప్పు చేస్తేనే, రాద్ధాంతం చేసిన వైసీపీ, ఇప్పుడు తాము అధికారంలోకి వచ్చిన తరువాత, ఏడాది కాలంలోనే 80 వేల కోట్లు అప్పు చెయ్యటమే కాక, ఇప్పుడు భూములు అమ్మి కూడా, డబ్బు సమకుర్చునే ప్రయత్నం చేస్తుంది. నిజానికి ప్రభుత్వం ఆధీనంలో ఉండే భూమి ఎంతో విలువైనది. డబ్బు పరంగా విలువైనది కాదు, భూమి పరంగా. ఎందుకుంటే, ఏదైనా ప్రాజెక్ట్ కు ఒక్క సెంటు భూమి కావాలి అంటే, రణరంగం జరిగే పరిస్థితి.
ఎవరూ భూములు తేలికగా ఇవ్వరు. ఒక కంపెనీ పెట్టాలి అంటే భూమి కావాలి. అలాంటిది ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భూమి అమ్మటం ఏమిటి ? భూములు రక్షించాల్సిన ప్రభుత్వమే దాన్ని అమ్మటమా అనే విమర్శలు వస్తున్నాయి. ఎవరైనా ఆదాయం పరిగే మార్గాలు ఆలోచిస్తారు. అవేమీ చెయ్యకుండా, అప్పులు తెచ్చి, ఆస్తులు అమ్మి ఎన్నాళ్ళు, ఒక రాష్ట్రాన్ని నెట్టుకుని వస్తారు ? దీనికి మళ్ళీ బిల్డ్ ఏపి అనే పేరు. ఇది బిల్డ్ ఏపి ఎలా అవ్తుంది ? సెల్ ఏపి కదా అయ్యేది. ఇదే విషయం పై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. లోకేష్ ట్వీట్ చేస్తూ, ఇది బిల్డ్ ఏపి కాదు, జగన్ కిల్లెడ్ ఏపి అని ట్వీట్ చేసారు. ఆదాయం ఎలా సంపాదించాలో తెలియని వాళ్ళు, మనం ఊరిలో చూస్తూ ఉంటాం, వాళ్ళే ఇలా ఆస్తులు అమ్మి, ఆ రోజుకి గడిపేస్తారు, అలా ఉంది మన ప్రభుత్వ పరిస్థితి.