ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పై, తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 203 జీవో పై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్ట్ చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలన్న ఆంధ్రప్రదేశ్ నిర్ణయం తీవ్ర అభ్యంతరకరం అని కేసీఆర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం విభజన చట్టానికి విరుద్ధమన్న కేసీఆర్, తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధమైన ప్రాజెక్టుపై న్యాయ పోరాటం చేస్తాం అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయంపై కృష్ణా వాటర్ మేనేజ్ మెంట్ బోర్డులో తెలంగాణ ప్రభుత్వం తరపున ఫిర్యాదు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు కేసీఆర్. అపెక్స్ కమిటీ ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్టు నిర్మాణం చేయడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తప్పిదం అని అన్నారు. తెలంగాణను సంప్రదించకుండా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై తీవ్ర అభ్యంతరం చేసారు. "గత వివాదాలను పక్కన పెట్టి ఏపీకి స్నేహ హస్తం అందించాం, భేషజాలు లేకుండా నీటిని వాడుకుందామని నేనే చొరవ చూపించా, అయినా ఏపీ ప్రభుత్వం మమ్మల్ని సంప్రదించలేదు, తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగితే రాజీ పడే ప్రసక్తే లేదని" కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇద్దరం పరస్పరం సహకరించుకుని, నీళ్ళు వాడుకుందాం అని అనుకున్నాం, కాని ఏపి చర్య దీనికి విరుద్ధంగా ఉందని అన్నారు. దీని పై ఏపి క్లారిటీ ఇచ్చింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూ సెక్కుల నుండి 80 వేలకు పెంచేందుకు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం నెల్లూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణకు ముఖ్యమంత్రి తొలిదశలోనే రూ. 7 వేల కోట్ల రూపాయలకు పాలనాపరమైన అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు.

కృష్ణానదీ నీటి ప్రవాహానికి సంబంధించి పవర్ మేనేజ్మెంట్ బోర్డు లెక్కల ప్రకారమే తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ వినియోగించుకుంటాయని పేర్కొన్నరు మంత్రి. ఈ విషయాన్ని రాజకీయం చేయడం సరికాదన్నారు. ఈ లెక్కలకు మించి ఒక్క చుక్క అధికంగా వాడుకొనేందుకు ఎవరికీ అవకాశం లేదన్నారు. గత ప్రభుత్వం తెలంగాణా ప్రభుత్వంలో నిత్యం ఘర్షణ వాతావరణం వుండేదని పేర్కొన్న అయన తమ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందన్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడుకొనే విషయంలో వెనుకంజ వేసేది లేదని పేర్కొన్న జలవనరులశాఖామంత్రి. అయితే గతంలో చంద్రబాబు ఇదే విషయం పై, అసెంబ్లీలో మాట్లాడుతూ, పక్క రాష్ట్రంకు మన హక్కులు తాకట్టు పెట్టవద్దు అని చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడే అదే నిజం అవుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read