విషవాయువు లికెజ్ ఘటనలో 12 మంది ప్రాణాలను హరించి, వందలాది మందిని ఆసుపత్రి పాల్టేసిన వెంకటాపురం ఎల్జీ పాలిమర్సు కంపెనీ 'కన్సుంట్ ఫర్ ఆపరేషన్' రద్దయింది. ఈమేరకు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉత్తర్వులు జారీచేసింది. సాధారణంగా ఏదేని ఫాక్టరీలు తమ ఉత్పత్తుల కార్యకలాపాలు కొనసాగించాలంటే ప్రధానంగా కన్సుంట్ ఫర్ ఆపరేషన్ సర్టిఫికేట్ తప్పనిసరి. వాతావరణ సమతుల్యతను దెబ్బతీయకుండా, పరిసర ప్రాంతాలలో ఎటువంటి కాలుష్యం వెదజల్లకుండా ప్రొడక్షన్ చేపడతామంటూ సంస్థ అందజేసిన ఒప్పుదల అంగీకార వత్రం మేరకు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విచారణ చేసి నమ్మకం కుదిరిన అనంతరం ఆ సంస్థకు సిఎఫ్ఓను జారీచేస్తుంది. ఈ మేరకు సదరు సిఎఫ్ఓలో పొందుపరిచిన నిబంధనలనన్నింటిని తూచా తప్పకుండా సంస్థ పాటించాల్సి వుంటుంది.

అయితే ఎల్జీ సంస్థ నుంచి ప్రమాదకర విషయవాయువు లీకవడం, మరణాలు సంభవించడం, వందలాది మంది రోగగ్రస్తులు కావడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న సిపిసిబి కొరడా ఝుళిపించింది. ఎట్టి సంస్థకు చెందిన సిఎఓ సర్టిఫికేట్ ను రద్దు చేసింది. దీంతో ఎల్జీ సంస్థ ఎటువంటి ఉత్పత్తులను చేపట్టరాదు. మరో పక్క కేంద్ర ప్రభుత్వం వత్తిడికి మేరకు ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం విశాఖ యూనిట్లోని స్టెరైన్ తరలింపు ప్రక్రియను వేగవంతం చేసింది. గ్యాస్ లీకేజీ సంభవించిన ట్యాంకులోప్రస్తుతం 73 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉందని, ప్రస్తుతం సురక్షిత స్థాయిలో ఉందని కలెక్టర్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం స్టెరైన్ 100 శాతం పాలిమరైజ్ అయిందని అధికారుల నివేదికలు పేర్కొన్నాయి. పరిశ్రమలో సామర్థ్యానికి మించి స్టెరీన్ నిల్వలున్నట్టు అధికారులు గుర్తించారని తెలుస్తోంది.

దీంతో ఈ నిల్వలను కొరియాకు తరలించేందుకు యుద్ధప్రాతి పదికన చర్యలు మొదలు పెట్టారు. దీనిపై పరిశ్రమ యాజమాన్యం ముందుగా 8వేల టన్నులను వెసల్ ద్వారా దక్షిణ కొరియాకు తరలిస్తున్నట్టు కలెక్టర్ వివరించారు. మరొక వెసల్ కూడా అందుబాటులోకి వచ్చిందని మరో అయిదురోజుల్లో 13వేల టన్నుల స్టెరైన్ తరలించడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు కలెక్టర్ స్పష్టం చేశారు. దీనిపై అత్యున్నత స్థాయి బృందం కంపెనీలో నిశిత పరిశీలన చేసిందని, ఒకప్రణాళిక ప్రణాళిక కూడా రూపొందిస్తుందని పేర్కొన్నారు. ఎల్జీ సంస్థ ప్రాంగణంలో వున్న 2700 లీటర్లతో పాటు ఈస్ట్రన్ పవర్ పెట్రో కెమికల్స్ ప్రయివేట్ లిమిటెడ్ వద్ద వున్న నిల్వలతో కలిపి సుమారు 13000 టన్నుల స్టెరీను సౌత్ కొరియా పంవనున్నారు.. సోమవారం నాటికే 8000 టన్నుల స్టెరీన్ వెనకకు పంపినట్టు తెలుస్తుంది. కాగా అంతర్జాతీయ మార్కెట్ లో ఒక టన్ను స్టెరీన్ విలువ సుమారు 85 వేల రూపాయలు పలుకుతుంది. ఈ మేరకు సుమారు 110 కోట్ల రూపాయల స్టెరీర్‌ను విశాఖ నుంచి సౌత్ కొరియా పంపుతుండడం గమనార్హం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read