విద్యుత్ రంగంలో సంస్కరణలపై వేగంగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రానికో రీతిలో విద్యుత్ చార్జీలు కాకుండా ఇక దేశమంతటా ఒకే రీతిలో విద్యుత్ చార్జీలు రాబోతున్నాయి. ఇందుకోసం జాతీయ స్థాయి ఏకీకృత చార్జీల విధానం అమలు కానుంది. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగంలో ఇప్పుడున్న చట్టాలకు భారీగా సవరణలు చేపడుతూ ముసాయిదా బిల్లును సిద్ధం చేసింది. ఎన్టీయే సర్కా రు ఈ బిల్లును రానున్న పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టి ఉభయ సభల ఆమోదం పొందాలన్న అభిప్రాయంతో ఉంది. 2003లో విద్యుత్ చట్టానికి సవరణలు ప్రతిపాదించి. గత నెల 17న ముసాయిదా విద్యుత్ సరవణ చట్టం ప్రతిపాదనలపై సలహాలు సూచనలకోసం రాష్ట్రాల కు పంపింది. మేనెల 8వరకూ ఇందుకోసం గడువు ఇచ్చింది. అయితే దేశమంతటా క-రో-నా వైరస్ ప్రభావం,లాక్ డౌన్ అమలు తదితర కారణాల వల్ల ఈ గడువును మరింత పెంచింది. జూన్ 8లోపురాష్ట్రాలు విద్యుత్ చట్ట సవరణ ముసాయిదాపై తమ అభ్యంతాలు, అభిప్రాయాలు, సలహాలను కేంద్రానికి తెలిపేందుకు గడువు పెంచింది.
విద్యుత్ చట్ట సవరణ ముసాయిదాలో విద్యుత్ చార్జీల ఏకీకృత విధానం, విద్యుత్ కొనుగోలు ఒప్పం దాలు వాటి అమలు, ప్రత్యేక అధారిటీ ఏర్పాటు, అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు ముఖ్యమైన అంశాలుగా ఉన్నాయి. విద్యుత్ రగంలో ఏవైనా సమస్యలు వివాదాలు ఉత్పన్నమైతే వాటిని అధారిటీ విచారణ చేసి తీర్పునిస్తుంది. అధారిటీ తీసుకున్న నిర్ణయాలు ,తీర్పులు నచ్చని వారు అప్పీలేట్ ట్రిబ్యునల్ లో అప్పీలు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా, మన రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తరువాత, పీపీఏలు సమీక్షిస్తాను అనే విధానం ఇక కుదరదు. ఇలా చేస్తే, అధారిటీ ఎంటర్ అవుతుంది. విద్యుత్ రంగంలో ఎటువంటి చట్టాలున్నా వినియోగదారులందరికీ ఆసక్తి కరమైనది. ఇకపై విద్యుత్ పంపీణీ సంస్థలు విద్యుత్ చార్జీలకు సంబంధించిన బిల్లుల్లో ఎటువంటి రాయితీలు సబ్సిడీలు కల్పించవు. విద్యుత్ సరఫరా దారులనుంచి విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ పంపిణీ తదిరత అన్ని రకాలు ఖర్చులను మదింపు చేసుకుని వాస్తవిక ఖర్చుకు అనుగుణంగా ఒకే టారీఫ్ ను నిర్ణయిస్తారు. ఇప్పడున్న విధంగా గృహ వినియోగ,వ్యవసాయ , వాణిజ్య, పారిశ్రామిక, ధార్మిక తదితర కేటగిరీలన్నీ రద్దయి ఓకే కేటగిరి అమల్లోకి వస్తుంది.
అయితే ఇప్పుడున్న వివిధ రకాల స్లాబులను మాత్రం యధాతధంగా కొనసాగించే అవకాశాలు ఉంటాయి. రాష్ట్రప్రభుత్వాలు కొన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ వినియోగ దారులకు ఏవైనా సబ్సిడీలు, ఉచిత విద్యుత్ పదకాలను అమలు చేయాలనుకుంటే విద్యుత్ గ్యాస్ తరహాలో చార్జీల సబ్సిడీ సొమ్మును నేరుగా వినియోగదారుడి బ్యాంకు ఖాతాలకే జమ చేయాల్సి ఉంటుంది. వినియోగదారులకు ఇప్పడిస్తున్న క్రాస్ సబ్సీడీలు ఇక ఉండవు. చట్ట సరవరణల ముసాయిదా ప్రకారం ఇక జలవిద్యుత్ కూడా పునరుత్పాదక విద్యత్ ఖాతాలోకి చేరిపోనుంది. విద్యుత్ నియంత్రణ కోసం ప్రస్తుతం రాష్ట్రాల పరిధిలో ఉన్న విద్యుత్ నియంత్రణ మండళి నియామకాల అధికారాన్ని ఇక కేంద్ర ప్రభుత్వమే తనచేతుల్లోకి తీసుకోనుంది. జాతీయ స్థాయిలో సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి చైర్మన్‌గా విద్యుత్ రంగ నిపుణులతో కూడిన కమిటీని నియమించనుంది. ఈ కమిటీ రాష్ట్రాల్లో ఈ ఆర్పీలకు చైర్మన్లు, సభ్యుల నియమాకాలకు పేర్లను సిఫార్సు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈఆర్సీల నిర్వహణ వ్యయాలను రాష్ట్రాలే భరించాల్సివుంటుంది.