కరోనా నిరోధక చర్యలు, లాక్ డౌన్ మార్గదర్శకాల్లో మార్పులతో ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కేంద్రం జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. వైరస్ వ్యాప్తి రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా ఏపీలో జిల్లాలవారీగా 3 జోన్లను ప్రకటించిన కేంద్రం. గ్రీన్ జోన్‌లో ఉన్న విజయనగరం జిల్లా. రెడ్ జోన్ జిల్లాలు : కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు. మిగిలిన ఏడు జిల్లాలను ఆరెంజ్ జోన్ గా ప్రకటన చేసింది కేంద్రం. కంటైన్మెంట్ ప్రాంతాలను మ్యాపింగ్ చేసేందుకు జిల్లా యంత్రాంగానికి బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. వైరస్ వ్యాప్తి, కాంటాక్టులు, ఇతర అంశాల ఆధారంగా కంటైన్మెంట్లు చేయాలని సూచన చేసింది. కంటైన్మెంట్ క్లస్టర్ కు అదనంగా 500 మీటర్ల నుంచి కిలోమీటర్ ప్రాంతం బఫర్ జోన్ గా ఉంచాలని సూచన.
రిస్కు ఉన్న ప్రాంతాన్ని అవసరమైతే 3 కిలోమీటర్ల దాకా బఫర్ గా ప్రకటించాలని ఆదేశం. పట్టణాల్లో వార్డు, కాలనీని, గ్రామాల్లో పంచాయతీని కంటైన్మెంట్ గా గుర్తించాలని సూచన. కంటైన్మెంట్ ను మిగతా ప్రాంతాలతో వేరు చేసేలా బారికేడ్లు వేయాలని ఆదేశాలు. రిస్కు ఉన్న ప్రాంతాల నుంచి రాకపోకలపై కఠినంగా దృష్టి పెట్టాలని సూచన. ఔషధాలు, నిత్యావసరాలు మాత్రమే సరఫరాకు అనుమతి. థియేటర్లు, మాల్స్, దేవాలయాలు, ఇతర ధార్మిక ప్రదేశాలకు అనుమతి నిరాకరణ. క్రీడా, రాజీకయ, సామాజిక సమావేశాలు, విద్యాసంస్థలకు అనుమతి నిరాకరిస్తు, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
ఇకపోతే, రేపటి నుంచి మద్యం షాపులు కూడా తెరుసుకోనున్నాయి. 25 శాతం అధిక ధరలతో మద్యం అమ్మకాలు జరగనున్నాయి. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, అమ్మకాలు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. మరో పక్క, జగన్ కు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి లేఖ రాసారు. రాష్ట్రంలో కరోనా విస్తరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. కలెక్టర్ స్వీయ నిర్బంధంలో ఉన్నారంటే.. వైరస్ వ్యాప్తి తీవ్రత ఎంత ఉందో అర్థమవుతోంది. కరోనాతో మనం సహజీవనం చేయడం కాదు. మనతో కరోనా సహజీవనం చేసే పరిస్థితి తెచ్చారు. ఏపీకి వెళ్లొద్దని పక్క రాష్ట్రాలు అప్రమత్తం చేయడం ఆందోళన కలిగిస్తోంది అంటూ, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, జగన్ కు లేఖ రాసారు.