ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క-రో-నా కేసులు పెరిగిపోతూనే ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి రోజు 70 నుంచి 80 కేసులు వస్తూ దూసుకుపోతుంది. ఈ రోజు మాత్రం, కొంచెం నెమ్మదించింది. ఈ రోజు కేవలం 60 కేసులు వచ్చాయి. అయితే ఇది పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఉంది. 45 రోజుల లాక్ డౌన్ తరువాత కూడా, ఇలా కేసులు పెరగటం పై, అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క గత పది రోజులుగా, తెలంగాణా, కేరళ, కర్ణాటక, ఒరిస్సా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. తెలంగాణాలో అయితే కేవలం ఆరు ఏడు కేసులు మాత్రమే వస్తున్నాయి. ఇక కేరళ, ఒరిస్సా అయితే మరీ తక్కువ. వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలతో, అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చి, కర్వ్ ఫ్లాట్ అవుతూ వచ్చింది. చాలా తక్కువ కేసులు వస్తూ వచ్చాయి. అయితే ఇదే క్రమంలో, ఏపిలో మాత్రం, అటు కేసులు, ఇటు మరణాలు కూడా ఎక్కువగా వస్తున్నాయి.

ఈ నేపధ్యంలోనే, తమిళనాడు రాష్ట్రంలో సరిహద్దు దగ్గర గోడలు కట్టారు, అలాగే ఒరిస్సా సరిహద్దులో రోడ్డు తవ్వేసారు, ఇక తెలంగాణాలో అయితే, ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్ళవద్దు అంటూ హెచ్చరించారు. ఎంత ఎమర్జెన్సీ అయినా, ఆంధ్రప్రదేశ్ కు మాత్రం వెళ్ళవద్దు అన్నారు. ఈ క్రమంలోనే, ఈ రోజు తెలంగాణా మంత్రి ఈటెల రాజేంద్ర ఒక అడుగు ముందుకు వేసి మరీ, ఏపి పై వ్యాఖ్యలు చేసారు. తెలంగాణలో లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేసి ఉండకపోతే. పక్కన ఉన్న ఒక కర్నూలు లాగా, ఒక గుంటూరులా తయారయ్యేది అంటూ, ఏపి సరిగ్గా చెయ్యటం లేదు, తెలంగాణ మెరుగ్గా చేస్తుంది అనే విధంగా తెలంగాణ మంత్రి మాట్లాడారు. కర్నూల్, గుంటూరు లాంటి పరిస్థితి మనకు లేదని అన్నారు.

మర్కజ్ కాంటాక్స్ పట్టుకోక పోతే.. దేశంలో హైదరాబాద్ లో ఎక్కువ కేసులు ఉండేవి. మేము అవి మార్చి 16నే పట్టుకుని, కాంట్రోల్ చేసాం కాబట్టే, ఇప్పుడు మెరుగ్గా ఉన్నాం అని అన్నారు. అలాగే టెస్టింగుల పై మాట్లాడుతూ, మేము పనికి వచ్చే టెస్టులు మాత్రమే చేస్తున్నాం. ఆర్టీ పీసీఆర్ టెస్టులు ఏదైతే ప్రామాణికమో అవే చేస్తున్నాం, రాపిడ్ టెస్టులు, మిగతా టెస్టులు చేసినా అనవసరం, అవి ప్రామాణికంగా కాదు అని, ఇప్పటికే ఐసీఎంఆర్ చెప్పింది, ఊరికే గొప్పలు చెప్పుకోవటానికి, అన్ని టెస్టులు చేసి, చెప్పుకోవాల్సిన పని లేదు, అంటూ ఈటేల చెప్పుకొచ్చారు. ఈ అంశం వచ్చిన దగ్గర నుంచి, ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నామో అందరూ చూస్తున్నారని, ఈటెల అన్నారు. అయితే ఇదే సందర్భంలో, ఏపి పై చేసిన వ్యాఖ్యల పై, వైసీపీ నేతలు ఏమంటారో చూడాలి. దేశం మొత్తం మా జగన్ వైపు చూస్తుంది అని చెప్తున్న వైసీపీ నేతలు, ఎలా స్పందిస్తారో మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read