మరో రెండు రోజుల్లో లాక్ డౌన్ 2 ముగుస్తున్న వేళ, లాక్ డౌన్ పొడిగింపు పై, కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా, లాక్ డౌన్ పొడిగిస్తూ మరో కీలక నిర్ణయం తీసుకుంది. విపత్తు నిర్వహణ చట్టం-2005 ప్రకారం మే 4 నుంచి మరో రెండు వారాలు, లాక్ డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయం పై, కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన చేసింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశ వ్యాప్తంగా ఉన్న ఈ లాక్ డౌన్, ఈనెల 17వరకు ఉండనుంది. అలాగే జోన్లవారీగా నూతన మార్గదర్శకాలు జారీ చేస్తూ హోంశాఖ కీలక ఆదేశాలు ఇచ్చింది. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో నిబంధనల మేరకు కొన్ని సడలింపులు చేసింది. ఏప్రిల్ 30న ఇచ్చిన మార్గదర్శకాల మేరకు రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్ల గుర్తింపు చేయాలని సూచించింది. వరుసగా 21 రోజులుగా ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాని జిల్లాలు గ్రీన్ జోన్‌గా పరిగణించాలని స్పష్టం చేసింది.
రవాణా, పాఠశాలలు, కళాశాలలు, సినిమాహాళ్లు మూసివేసి ఉంటాయని వెల్లడి. క్రీడా ప్రాంగణాలు, రెస్టారెంట్లు, హాటళ్లు, సాంస్కృతిక కేంద్రాలు మూసివేత. మతపరమైన కేంద్రాలు మూసివేసి ఉంటాయని తెలిపిన కేంద్రం. అత్యవసరం కాని పనులకు రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకు అనుమతి లేదన్న కేంద్రం. 65 ఏళ్లు దాటిన వృద్ధులు, పదేళ్ల పిల్లలు, గర్భిణీలు ఇళ్లలోనే ఉండాలన్న కేంద్రం. రెడ్ జోన్లలో సైకిళ్లు, ఆటో రిక్షాలు, క్యాబ్ లు, ట్యాక్సీలకు అనుమతి ఉండదన్న కేంద్రం. సెలూన్లకు కూడా అనుమతి లేదని తెలిపిన కేంద్రం. అంతర్ జిల్లా బస్సు సర్వీసులకు అనుమతి ఉండదని కేంద్రం ప్రకటన. గ్రామీణ ప్రాంతాల్లో అన్ని వ్యవసాయ పనులకు అనుమతి ఇచ్చిన కేంద్రం.
రెడ్ జోన్లలో ఎలక్ట్రానిక్ మీడియా, ఐటీ సేవలు, డేటా కాల్ సెంటర్లకు అనుమతి. ఆరెంజ్ జోన్లలో ట్యాక్సీ సేవలకు డ్రైవర్, ఒక సహాయకుడి సాయంతో అనుమతి. గ్రీన్ జోన్లలో అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతి ఇస్తున్నట్లు కేంద్రం వెల్లడి. గ్రీన్ జోన్లలో 50 శాతం ప్రయాణికులతో బస్సులకు అనుమతి. ఇక అన్నిటికంటే, మందుబాబులకు మజాను ఇచ్చే వార్తా చెప్పింది కేంద్రం. కాకపోతే ఇది కేవలం గ్రీన్ జోన్ వాళ్ళకే. గ్రీన్ జోన్ల పరిధిలో మందుబాబులకు ఊరట ఇచ్చింది. గ్రీన్ జోన్ ల పరిధిలో పాన్ షాపులు, లిక్కర్ షాపులు అమ్మకాలు చేపట్టవచ్చ. షాపుల దగ్గర 5 కంటే ఎక్కు వ ఉండకూడదు, 5 గురు కూడా ఒక్కరి మధ్య రెండుగజాల దూరం ఉండాలి అంటూ కేంద్ర హోం శాఖ చెప్పింది.