కరోనా వైరస్ లాక్ డౌన్ అమలవుతున్న సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకోవడం వివాదాస్పదంగా మారింది. ఆలయ నిబంధనల మేరకు టిటిడికి సంబంధించిన పాలకమండలి ఛైర్మన్, టిటిడి ఈవో, అదనవు ఇఒతోబాటు విధుల్లో వున్న అర్చకులు. ఉద్యోగులు ఆలయంలోనికి అనుమతివుంది. అయితే శుక్రవారం (నిన్నటి) రోజు సుబ్బారెడ్డి పుట్టినరోజు సందర్భంగా తెల్లవారుజామున జరిగిన శ్రీవారి అభిషేక సేవలో ఆయన వంతుగా తల్లిని, భార్య స్వర్ణమ్మతో కలసి ఆలయంలోనికి చేరుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆయన ఆలయం వెలుపలకు వచ్చారు. టిటిడి చైర్మన్ ప్రోటోకాల్ పరిదిలోనే దర్శనం చేసుకున్నారనేది ఆలయ వర్గాల వాదన, దీనిపై టిటిడి వర్గాలు కూడా నోరుమెదపదానికి సాహసించడంలేదు.
లాక్ డౌన్ అమలవుతున్న సమయంలో టిటిడి ఛైర్మన్ సుబ్బారెడ్డి దంపతులు శుక్రవారం రోజు బయటి జిల్లా నుంచి తిరుమలకు చేరుకున్నారని, ఆలయంలోనికి ఎలా అనుమతిస్తారనే ఆరోవణలను ట్విట్టర్ వేదికగా టిడిపి ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారాలోకేశ్ గుప్పించడం శనివారం సంచలనం రేకెత్తించింది. కరోనా వైరసను అడ్డుకరునేందుకు ఇప్పటికే బయటి ప్రాంతాల నుంచి భక్తులను ఆలయంలోనికి అనుమతించని టిటిడి అధికారులు ఛైర్మన్ విషయంలో సడలింపులు ఇచ్చారనే దుమారం రేపింది. సాధారణ భక్తులకు లేని దర్శనం వైఎస్ తోడల్లుడు వస్తే ఎలా ఆలయంలోనికి అనుమతించారని ఆరోపించారు. తిరుమల కొండ నిర్మానుష్యంగా మారినవేళ నిబంధనలు ఉల్లంఘించి స్వామివారి సన్నిధిలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అపరాధం కాదా అంటూ లోకేశ్ విమర్శించారు.
నీ కొండను నీవే కాపాడుకో స్వామీ అంటూ ఆయన వ్యాఖ్యానిస్తూ ట్వీట్ చేశారు. మొత్తంమీద ఈ వ్యవహారంపై టిటిడి అధికారులు, ఛైర్మన్ శ్రీవారి భక్తులకు తమ సంజాయిషీ ఎలా ఇచ్చుకొంటారనేది వేచిచూడాల్సిందే. అయితే శుక్రవారం రోజు ఛైర్మన్ సుబ్బారెడ్డి స్వామివారి అబిషేక సేవ దర్శనంలో ప్రోటోకాల్ పరంగా పాల్గొన్నారని సుబ్బారెడ్డి ట్విట్టర్ ద్వారా చెప్పారు. ఛైర్మన్ వైవి టిటిడి ఛైర్మన్ సుబ్బారెడ్డి ట్విట్టర్ వేదికగా శనివారం రాత్రి తన దర్శనం విషయంపై వివరణ ఇచ్చారు. ప్రతి శుక్రవారం శ్రీవారికి జరిగే అభిషేక సేవకు రెండు వారాలకు ఒకసారి ఛైర్మన్ హోదాలో హాజరుకావడం ఆనవాయితీ. నిన్న అలాగే వెళ్ళాను. తన తల్లి, తన భార్య తప్ప బంధువులు ఎవ్వరూ లేరని , ఫోటోలో వున్నది టిటిడి ఉద్యోగులు అని వివరించారు. అయితే ఈ వాదన మాత్రం సంతృప్తిగా లేదు. పెద్ద వయసు ఉన్న తల్లిగారిని, భార్యను, వేరే జిల్లా నుంచి రప్పించటం పై, అలాగే ఆ వీడియోలో ఎవరికీ మాస్కులు లేకపోవటం పై కూడా, అభ్యంతరాలు వ్యటం అవుతున్నాయి. ఇదే విషయం పై, జాతీయ మీడియా కూడా భగ్గు మంది. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి, గుడిలో పూజలు, తన పుట్టిన రోజున చేసారని, ఇండియా టుడే ఛానల్ ఒక కధనం ప్రసారం చేసింది.