ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మాజీ రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరం రోజుకి ఒక మలుపు తిరుగుతుంది. ముఖ్యంగా రెండు విషయాల్లో, ఈ వ్యవహారం నడుస్తుంది. మొదటిగా, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని, రాష్ట్ర ఎన్నికల అధికారిగా, ఒక ఆర్డినెన్స్ తెచ్చి, తప్పించేలా చెయ్యటం పై, ఇప్పటికే కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి, మొన్న 29వ తారీఖునే తీర్పు వస్తుందని అందురూ అనుకున్నారు. అయితే, అనూహ్యంగా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేస్తున్న విచారణలోకి, బయట వ్యక్తులు ప్రవేశించటం పై, హైకోర్ట్ చీఫ్ జస్టిస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ కేసు విచారణను, సోమవారానికి వాయిదా వేసారు. సోమవారానికి వాయిదా వెయ్యటమే కాకుండా, ఈ కేసు విచారణ, నేరుగా కోర్ట్ లోనే చేస్తాం అని చెప్పి, డీజీపీకి కూడా ఉత్తరం రాస్తాం అని చెప్పారు. దీంతో, సోమవారం పూర్తీ స్థాయిలో విచారణ జరిగి, ఈ విషయం పై, రేపు సోమవారం ఈ విషయంలో తీర్పు వస్తుందని అందరూ భావిస్తున్నారు.

అయితే నిమ్మగడ్డ విషయంలో, మరో విషయంలో కూడా ఒక వివాదం నడుస్తుంది. అదే నిమ్మగడ్డ, కేంద్ర హోం శాఖకు రాసిన లేఖ. మరో రెండు రోజులల్లో, ఎన్నికల కమిషన్ నియామకం గురించి తీర్పు వస్తుంది అని తెలుస్తున్న సమయంలో, ఈ లేఖ పై హైదరాబాద్ వెళ్లి మరీ సిఐడీ విచారణ చేస్తుంది. ముఖ్యంగా, నిమ్మగడ్డ అడిషనల్ పీఎస్ సాంబమూర్తిని, ఈ విషయంలో విచారణ చెయ్యటానికి, సిఐడి హైదరాబాద్ వెళ్లినట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని సిఐడి దృవీకరించకపోయినా, వార్తా ఛానెల్స్ లో ఈ విషయం పై పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఆయన స్టేట్మెంట్ ను, సిఐడి రికార్డు చేసే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే, ఇప్పటికే అయ్యన్ను, ఒక మారు సిఐడి విచారణ చేసింది.

ఈ విచారణ రెండో సారి. అయితే ఆయాన విచారణలో ఏమి చెప్తున్నారు అనే విషయం పై తెలియాల్సి ఉంది. అయితే గత విచారణలో, అడిషనల్ పీఎస్ సాంబమూర్తి, పలు విషయాలు చెప్పారు అంటూ, మీడియాలో వార్తలు వచ్చాయి. కేంద్ర హోం శాఖకు రాసిన లేఖ, నిమ్మగడ్డ రమేష్ కుమార్, డ్రాఫ్ట్ చేసి, తనకు ఒక పెన్ డ్రైవ్ లో పెట్టి ఇచ్చారని, దాన్ని నేను నా డెస్క్ టాప్ లో పెట్టి, ఫార్మటు చేసి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఇచ్చానని, ఆయన అక్కడ నుంచి కేంద్రానికి పంపించారని, తరువాత డెస్క్ టాప్ ఫార్మటు చేశాను అంటూ, ఆయన చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ లేఖ పై, వైసీపీ ఎందుకు గోల చేస్తుందో ఎవరికీ అర్ధం కావటం లేదు. నేనే లేఖ రాసాను, థర్డ్ పార్టీ వారికి ఎందుకు అంటూ నిమ్మగడ్డ ఇప్పటికే చెప్పారు. అలాగే కేంద్రం కూడా నిమ్మగడ్డ నుంచి లేఖ వచ్చిందని చెప్పండి. ఆ లేఖలో అంశాలు ఏమైనా తప్పు ఉంటే, వైసీపీ చెప్పాలి కాని, ఆ లేఖలో తమ పై చేసిన ఆరోపణలు గురించి సమాధానం చెప్పకుండా, లేఖ టిడిపి రాసింది అంటూ, చెప్పటం, దానికి సిఐడి ఎంక్వయిరీ చెయ్యటం పై, అందరినీ ఆశ్చర్యం కలిగిస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read