జగన్ మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి మధ్య ఎదో జరుగుతుందని, గతంలో ఎంతో సన్నిహితంగా ఉన్న ఇద్దరి మధ్య, కొంచెం గ్యాప్ వచ్చింది అంటూ, వార్తలు వచ్చిన టైంలో, జరిగిన కొన్ని సంఘటనలతో, ఈ ప్రచారానికి బలం చేకూర్చుటం, ప్రతిపక్షాలు విమర్శలు చెయ్యటం చూసాం. జగన్ మోహన్ రెడ్డి ఎల్జీ పాలిమర్స్ పర్యటనకు వెళ్తున్న సమయంలో, విజయసాయి రెడ్డిని కారు దించేయటం, తరువాత తెలుగుదేశం, జనసేన విజయసాయి రెడ్డి పై విమర్శలు చెయ్యటం, సోషల్ మీడియాలో విజయసాయి రెడ్డికి అనుకూలంగా కొంత మంది పోస్టులు పెట్టటం తెలిసిందే. అయితే, ఇవన్నీ గిట్టని వారు చేస్తున్నారని, నాకు జగన్ కు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని, చనిపోయేంత వరకు జగన్ తోనే అంటూ, ఏకంగా విజయసాయి రెడ్డి మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పారు. ఇది నిజంగానే సోషల్ మీడియా ప్రచారం అయితే, విజయసాయి రెడ్డి స్థాయి వ్యక్తులు స్పందించరు. మరి ఆయన ఎందుకో స్పందించి, మా ఇద్దరి మధ్య ఎలాంటి గ్యాప్ లేదని చెప్పారు. ఇక ఇక్కడ నుంచి విజయసాయి రెడ్డి, ఆయన అనుచరులు, టిడిపి పై ఎదురు దాడి మొదలు పెట్టారు. లోకేష్, రామ్మోహన్ నాయుడు పై పోస్టులు పెడుతూ, ఇద్దరి మధ్య చిచ్చు పెట్టె ప్రయత్నం మొదలు పెట్టారు.

ఈ ప్రచారాన్ని, అటు రామ్మోహన్ నాయుడు, లోకేష్ కూడా, పేటీయం ప్రచారం అని, ఖండించారు కూడా. అయితే ఈ రోజు మళ్ళీ ఏకంగా విజయసాయి రెడ్డి, ఒక పోస్ట్ పెట్టారు. కొడుకుకి తినటం తప్ప ఏమీ రాదని, సీనియర్లు చేతులు ఎత్తేయటంతో, చంద్రబాబు ఎవరు అయితే ఏమిటిలే అని, 32 ఏళ్ళ రామ్మోహన్ నాయుడుకి, అధ్యక్ష పదవి ఇచ్చి, ఉత్తరాంధ్ర ప్రజలను బుజ్జగించాలని చూస్తున్నారని, అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేసారు. అయితే దీని పై రామ్మోహన్ నాయుడు కూడా అదే విధంగా విజయసాయి రెడ్డి ట్వీట్ కి స్పందించారు. అవినీతి తిమ్మరాజు, చేతకాని పాలనకు, పార్టీలో వాళ్ళే ఛీ కొడుతున్నారు. కారు దించిన కక్షతో, అప్రూవర్ గా మారి, ఎప్పుడు కుర్చీ లాక్కుందామా అని ధ్యాసే కాని, హోదా, రైల్వే జోన్ లాంటి వాటిని అడగలేక, మూడు ముక్కల రాజధానితో మూతి కాల్చుకుని, ఢిల్లీలో కాళ్ళు మొక్కుతూ, ట్విట్టర్ లో రెచ్చిపోవటం తప్ప, మీరు చేసేది ఏమిటి, రాష్ట్రానికి ఉపయోగ పడే పని చెయ్యండి అంటూ, విజయసాయి రెడ్డికి కౌంటర్ ఇచ్చారు రామ్మోహన్ నాయుడు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read