ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి రోజు రోజుకీ దారుణంగా తయారు అవుతుంది. 2019 వరకు అనేక రంగాల్లో దూసుకుపోతూ, ఇతర రాష్ట్రాలకు పోటీ ఇచ్చిన ఏపి పరిస్థితి , రోజు రోజుకీ దారుణం అవుతుంది. చాలా విషయాల్లో పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది. కో-వి-డ్ వల్ల పరిస్థితి ఇలా ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నా, రాష్ట్రం మాత్రం కోలుకోవటం లేదు. ప్రభుత్వ విధానాలు కూడా ఇలాగే ఉంటున్నాయి. కేవలం అప్పుల్లో మాత్రమే ఏపి నెంబర్ వన్ గా ఉంటుంది. మిగతా అన్ని రంగాల్లో పాతాళంలోకి వేగంగా వెళ్ళిపోతున్నాం. తాజాగా దేశంలో ఎగుమతులు విషయంలో ర్యాంకులు వచ్చాయి. రెండో అతి పెద్ద తీర రాష్ట్రంగా ఏపికి పేరు ఉంది. మన నుంచి వెళ్ళే ఎగుమతులు, ప్రతి ఏడు గణనీయంగా పెరుగుతూ వచ్చాయి. గుజరాత్, మహరాష్ట్ర తరువాత మన నుంచే ఎక్కువ ఎగుమతులు జరిగేవి. అయితే ఇప్పుడు పరిస్థితి రివర్స్ అయ్యింది. రెండో అతి పెద్ద తీర రాష్ట్రం ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎగుమతుల్లో మాత్రం దారుణంగా ఉంది. చంద్రబాబు హయాంలో ఎగుమతల్లో మన ర్యాంక్ మూడో స్థానంలో ఉంది. తాజాగా కేంద్రం విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో మన రాష్ట్రం, తొమ్మిదో స్థానానికి దిగజారి పోయింది. కేంద్ర వాణిజ్యశాఖ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో మన స్థానం 3 నుంచి తొమ్మిదికి పడిపోయింది.

rank 10112021 2

గతంలో మన రాష్ట్రం స్కోరు 3.42 ఉండగా ఇప్పుడు 3.17 కి పడిపోయింది. సహజంగా మిగత రాష్ట్రాలతో పోల్చితే, ఎక్కువ తీర ప్రాంతం ఉన్న మన దగ్గర ఎక్కువ ఎగుమతులు ఉండాలి కానీ, ఏ కారణం చేతో, మన కంటే తక్కువ రాష్ట్రాలు, అసలు తీర ప్రాంతం లేని రాష్ట్రాల నుంచి కూడా మన కంటే ఎక్కువ ఎగుమతులు వచ్చాయి. మన రాష్ట్రం కంటే, ఒడిషా, యూపీకి ఎక్కువ ర్యాంక్ వచ్చింది అంటే, మన పరిస్థితి, మన విధానాలు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. మౌళిక సదుపాయాల పైన దృష్టి పెట్టక పోతే జరిగే పరిణామాలు ఇలాగే దారుణంగా ఉంటాయి. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్న రోడ్డుల దారుణ పరిస్థితి కూడా ఈ పతనానికి ఒక కారణంగా చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే ప్రభుత్వం మాత్రం, రెండు నెలల ముందు అట్టహాసంగా ఒక ఎగుమతుల ఫెస్టివల్ నిర్వహించి, ఆంధ్రప్రదేశ్ ఎగుమతల్లో ఇరగదీసిందని, జగన్ గారి పాలన అద్భుతం అంటూ కీర్తించారు. తీరా కేంద్రం ఇచ్చిన ర్యాంకులు చూస్తే ఇలా ఉన్నాయి. మరి ఇప్పటికైనా ఎక్కడ తప్పు జరుగుతుందో, ప్రభుత్వం తెలుసుకుని, దాన్ని సరి చేస్తే, ఏపికి అద్భుతమైన అవకాశాలు ఉంటాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read