ఉద్యోగులు విసుగెత్తి పోయారా ? గతంలో పీఆర్సిలు, డీఏలు, బోనస్ లు, అదీ ఇదీ అని ఆందోళన చేసే వారు. ఇప్పుడు టైంకి జీతాల కోసం కూడా ఉద్యోగులు ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఇక పీఆర్సి, డీఏ బకాయలు, ఐఆర్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇలా ప్రతిదీ పెండింగ్ లోనే ఉంటుంది. అడిగీ అడిగీ ఉద్యోగులు విసిగెత్తిపోయారు. ఈ రోజు ఏదో ఒకటి తేల్చుకుంటాం అంటూ సచివాయలం వద్దకు వచ్చారు. పీఆర్సీ నివేదిక లోని వివరాలు తమకు చెప్పాల్సిందే అంటూ, వాళ్ళు ఈ రోజు సచివాలయంలో చీఫ్ సెక్రటరీ వద్దకు వచ్చారు. జాయింట్ స్టాఫ్ కమిటీ కౌన్సిల్ మీటింగ్ తరువాత కూడా, పీఆర్సి నివేదికలోని వివరాలు వెల్లడించటంలో తీవ్ర జాప్యం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేసారు. రెండు రోజుల క్రితం, చీఫ్ సెక్రటరీని, ముఖ్య అధికారులను కలసిన సందర్భంలో, ఈ రోజు పీఅర్సి నివేదిక ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, సియంతో చర్చించిన తరువాత ఆ వివరాలు ఉద్యోగ సంఘాల నేతలకు చెప్తాం అని అధికారులు స్పష్టం చేసారు. దీంతో ఆ నివేదిక కోసం ఉద్యోగ సంఘాల నేతలు అందరూ కూడా, ఈ రోజు సచివాలయానికి వచ్చి చీఫ్ సెక్రటరీని కలిసారు. కానీ దాని పైన ఇంకా, ఎటువంటి స్పష్టత రాలేదు. అయితే ఈ రోజు ఎట్టి పరిస్థితిలోనూ పీఆర్సి నివేదిక ఇవ్వాల్సిందే అని డిమాండ్ పెట్టారు.

prc 10112021 2

ప్రభుత్వం నుంచి ఈ రోజు పీఆర్సీ నివేదిక పై చీఫ్ సెక్రటరీ నుంచి స్పష్టత రాలేదు. దీంతో ఉద్యోగ సంఘాల ముఖ్య నేతలు అందరూ కూడా ఇంకా సచివాలయంలోనే ఉన్నారు. రెండో బ్లాక్ దగ్గర ఉద్యోగ సంఘాల నేతలు కూర్చున్నారు. పీఆర్సీ నివేదిక ఇచ్చేవరకు సచివాలయం నుంచి వెళ్లబోమన్న ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు, బండి శ్రీనివాస్ తెగేసి చెప్పారు. ఉద్యోగుల సమస్యల పై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగ సంఘాల వ్యవస్థని బలహీనపరిచే కార్యక్రమం జరుగుతుందని అన్నారు. తమకు ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు ఇచ్చేలా చట్టం చేయాలని కోరారు. ఇప్పటికే ఏడు డీఏలు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. ఒక్క హామీ కూడా జగన్ మోహన్ రెడ్డి నెరవేర్చలేదని ఉద్యోగ సంఘాలు ఆరోపించాయి. అయితే ఉద్యోగ సంఘాలు తమ సంగతి తేల్చే వరకు సచివాలయం విడిచి వెళ్ళం అని చెప్పటంతో, పీఆర్సి నివేదిక బయట పెట్టేందుకు ప్రభుత్వ అనుమతి కోసం సీఎం క్యాంపు కార్యాలయానికి చీఫ్ సెక్రటరీ వెళ్లారు. మరి ఏమి జరుగుతుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read