జడ్జిలను, న్యాయస్థానాలను కూడా టార్గెట్ చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పేటీయం బ్యాచ్ కి, రైతులను టార్గెట్ చేయటం పెద్ద కష్టం ఏమి కాదు కానీ, అసలు వీరి టార్గెట్ ఏమిటి ? ఎందుకు ఇంత సడన్ గా అమరావతి రైతులను టార్గెట్ చేస్తున్నారు అనేది మాత్రం విశ్లేషించాల్సిందే. అమరావతి రైతులు గత 11 రోజులుగా న్యాయస్థానం టు దేవస్థానం అంటూ పాదయాత్ర చేస్తున్నారు. అమరావతి రైతుల పాదయాత్రను ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లైట్ తీసుకుంది. అమరావతి రైతులకు పెద్దగా మద్దతు ఉండదులే అని అనుకున్నారు. తాము చేసిన విష ప్రచారంతో, ప్రజల మద్దతు వీరికి లభించదు అనే అంచనాకు వచ్చారు. మొదటి రోజు సహజంగా ఎక్కువ ప్రజలు వస్తారని వదిలేసారు, కానీ రెండు, మూడు, పది రోజులు అయినా ప్రజాధరణ రోజు రోజుకీ పెరుగుతుంది కానీ తగ్గటం లేదు. ఇన్నాళ్ళు తాము ఎంత విష ప్రచారం చేసినా, ప్రజలు ఇంకా అమరావతి రైతుల పట్ల ఉండటం పై ఆశ్చర్య పోయారు. అమరావతిలోనే రైతులు నిరసన తెలుపుతుంటే, ప్రజలు ఎవరూ పట్టించుకోలేదు కానీ, ఇప్పుడు పాదయాత్రగా తమ ముందుకు వస్తుంటే మాత్రం, ప్రజలు చూస్తూ కూర్చోవటం లేదు. పెద్ద ఎత్తున గ్రామాలకు గ్రామాలు కదిలి వచ్చి, అమరావతి రైతులకు మద్దతు ఇస్తున్నాయి.
అమరావతి రైతులకు వస్తున్న ప్రజాధరణ చూసి, విష ప్రచారం మొదలు పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బ్యాచ్. ఇన్సైడర్ ట్రేడింగ్, కమ్మ రాజధాని, అంటూ చిమ్మిన విషం ఇక పని చేయదు అని అర్ధమైందో ఏమో కానీ, ఇప్పుడు ప్లాన్ మార్చారు. పాదయాత్రకు మద్దతు తెలపటానికి వచ్చిన యువతను, ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేసారు. వీరు వేసుకున్న బట్టలు, పెట్టుకున్న వాచీలో , చేతిలో సెల్ ఫోన్లు చూపిస్తూ వీళ్ళు రైతులా అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హేళన చేస్తున్నారు. ముఖ్యంగా మహిళను వీళ్ళు టార్గెట్ చేస్తున్న తీరు, దుర్మార్గంగా ఉంది. ఏ రైతులు అయితే మంచి బట్టలు, బూట్లు, వాచీలు పెట్టుకోకూడదా ? రైతు బిడ్డలు పెట్టుకోకూడదా ? వ్యవసాయ కుటుంబాల నుంచి ఎంత మంది అమెరికా వెళ్ళారో, ఈ సన్నాసులకు తెలియదా ? అసలు రైతు అంటే ఇలాగే ఉండాలి అనే నిర్వచనం చెప్పటానికి వైసీపీ ఎవరు ? వీలు అయితే మద్దతు ఇవ్వాలి, లేకపోతే నోరు మూసుకోవాలి కానీ, ఇలా ఉద్యమాన్ని, మహిళలను కించ పరిచే ఈ సైకోలకు ఎప్పటికి బుద్ధి వస్తుందో మరి.