అప్పులు... అప్పులు.. అప్పులు... మన గ్రామాల్లో చూస్తూ ఉంటాం, ఆదాయాం ఏమి లేక, అప్పులు చేసుకుని బ్రతికేస్తూ ఉంటారు. చివరకు వాడికి ఊరిలో ఎవరూ అప్పు ఇవ్వరు. ఆదాయం లేకపోతే ఎవరు ఇస్తారు ? చివరకు ఆస్తులు తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకుంటాడు. కొన్నాళ్ళకు ఆస్తుల తాకట్టు కూడా అయిపోతుంది. మళ్ళీ అప్పు కావాలి. ఏమి చేస్తాడు ? వరైటీ వరైటీ ప్లాన్లు వేస్తాడు. ఇంట్లో వస్తువులు, చావిట్లో ఉన్న గేదలు, ఆవులు, ఇలా ఏది పడితే అది, తాకట్టు పెట్టేసి అప్పు తెచ్చుకుని, ఆ నెల గడిపేస్తాడు. భవిష్యత్తు గురించి పట్టింపు ఉండదు. ఈ నెల గడించిందా లేదా ? అదే కావాలి. మన రాష్ట్ర పరిస్థితి కూడా ఇప్పుడు ఇలాగే ఉంది. కేంద్రం ఇచ్చే అప్పులు వాటాను, ఏడాదికి తీసుకోవాల్సింది, నాలుగు నెలలకే తీసుకున్నాం. మరింత అప్పు కోసం ఆస్తులు తాకట్టు పెట్టాం. చివరకు వరైటీగా, వచ్చే 25 ఏళ్ళ మద్యం ఆదాయం కూడా తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకున్నాం. ఇప్పుడు మరింత అప్పు కావాలి, అందుకే ఇదే మద్యం ఆదాయం పైనే మరింత అప్పు తెచ్చుకోవటానికి, మరో ప్లాన్ వేసింది జగన్ ప్రభుత్వం. మద్యం పై వ్యాట్ తగ్గించింది. అదేంటి వ్యాట్ తగ్గిస్తే ఇక పండగే కదా, తాగుడే తాగుడు అనుకోవచ్చు కదా అని అనుకుంటున్నారా ? అక్కడే మీరు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తక్కువ అంచనా వేసారు.

jagan plan 11112021 2

పెట్రోల్ మీద వ్యాట్ తగ్గించమంటేనే తగ్గించలేదు, ఆలాంటిది ప్రధాన ఆదయ వనరు అయిన మద్యం పై ఎలా తగ్గిస్తాడని అనుకుంటున్నారు ? మద్యం పై మీరు వేసిన అదనపు పన్ను చూసి, ఆదాయం వస్తుందని అప్పులు ఇచ్చాం, ఇప్పుడు కొత్త అప్పు కావాలి అంటే, ఏమి చూసి ఇవ్వాలి అని బ్యాంకులు ప్రశ్నించటంతో, మద్యం వ్యాట్ ఆదాయాన్ని ముక్కలు చేసారు. వ్యాట్ అంటే మొత్తం ప్రభుత్వం ఖజానాకు వెళ్తుంది. అందుకే ఇప్పుడు వ్యాట్, స్పెషల్ మార్జిన్ అని రెండు ముక్కలు చేసారు. వ్యాట్ ప్రభుత్వానికి వెళ్తే, స్పెషల్ మార్జిన్ బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు వెళ్తుంది. స్పెషల్ మార్జిన్ పెద్ద ముక్క. గతంలో స్పెషల్ మార్జిన్ నుంచి కేవలం రూ.60 కోట్లు ఆదాయం వచ్చేది, ఇప్పుడు దీన్ని అమాంతం రూ.6వేల కోట్ల వరకు పెంచేసారు. ఇంకేముంది, ఇది చూసి కొత్త అప్పులు వచ్చేస్తాయి. ఇక ప్రభుత్వ ఖజానుకు ఈ రూ.6 వేల కోట్లు రావు. ఉదహరణకు, ప్రస్తుతం వివిధ బ్రాండులు పై 130 శాతం నుంచి 190 శాతం వరకూ వ్యాట్‌ వేస్తున్నారు, ఇప్పుడు వ్యాట్ ని 35 శాతం నుంచి 60 శాతం వరకు తగ్గించి, స్పెషల్ మార్జిన్ పేరిట 85 శాతం నుంచి 130 శాతం వరకూ వసూలు చేస్తారట. రేట్లలలో ఎలాంటి తేడా ఉండదు కానీ, అప్పులు ఎక్కువ తెచ్చుకోవటానికి అయితే ఉపయోగ పడతాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read