ఆంధ్రప్రదేశ్ లో రాజన్న రాజ్యం వచ్చేసింది, ఇక తెలంగాణాలో రాజన్న రాజ్యం తెస్తాను అంటూ, పాదయాత్ర ద్వారా తెలంగాణా ప్రజల్లోకి వెళ్తున్న షర్మిలకు అనుకోని షాక్ తగిలింది. ఇప్పటికే అధ్వానమైన జగన్ మొహన్ రెడ్డి పాలనను చూపిస్తూ, ఇదేమీ రాజన్న రాజ్యం తల్లీ, ఇలాంటి రాజన్న రాజ్యం మా తెలంగాణాకు వద్దు అంటూ తెలంగాణా సమాజంలో నున్చివ్ వాదనలు వినిపిస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి అనుభవం ఇప్పుడు డైరెక్ట్ గా షర్మిలకే ఎదురైంది. రాజన్న రాజ్యం తెలంగాణాకు కూడా తీసుకుని వస్తాను అంటూ, షర్మిల గత 20 రోజులుగా పాదయాత్ర చేస్తున్నారు. ప్రజాప్రస్థానం అంటూ, తెలంగాణాలో పాదయాత్ర చేస్తున్నారు షర్మిల. షర్మిల ప్రస్తుతం పాదయాత్రని నల్గొండ జిల్లాలో చేస్తున్నారు. అక్కడ నేరళ్లపల్లి అనే ఊరులో పాదయాత్ర చేస్తూ పక్కనే ఉన్న ఒక పొలం లోకి వెళ్ళారు. అక్కడ చక్కగా పత్తి చేను వేసి ఉంది. అక్కడ కొంత మంది రైతు కూలీలు పనులు చేసుకుంటున్నారు. ఆ రైతు కూలీల వద్దకు వెళ్లి మాటలు కలిపారు షర్మిల. అక్కడ ఉన్న ఒక మహిళా కూలీలతో మీ కష్టాలు ఏమిటి అని చెప్పగా, ఆ మహిళా కులీ చెప్పిన మాటలు విని, షర్మిలకు షాక్ తగిలింది. అప్పటికే అక్కడ మీడియా కూడా ఉండటంతో, మొత్తం రికార్డు అవ్వటంతో, అసలు విషయం బయటకు వచ్చింది.
ఆ మహిళా కులీలో షర్మిలతో మాట్లాడుతూ, మాది తెలంగాణా కాదని, మేము కర్నూల్ జిల్లా నుంచి వచ్చాం అని చెప్పారు. మాకు కర్నూల్ లో పని లేదని, అందుకే అక్కడ నుంచి ఇక్కడకు వలసలు వచ్చామాని అన్నారు. అక్కడ వర్షాలు కూడా లేవని, పంటలు లేవని, పనులు దొరకటం లేదని, అందుకే పనులు కోసం అని బ్రతకటం కోసం, ఇలా వలస వచ్చామని, ఇక్కడ కులీ బాగానే గిట్టుబాటు అవుతుందని ఆ మహిళా కులీ చెప్పటంతో, షర్మిల ఒక్కసారిగా షాక్ తిన్నారు. తన అన్న తెచ్చిన రాజన్న రాజ్యం ఇంత అధ్వాన్నంగా ఉందా అనే సంకేతం ప్రజల్లోకి వెళ్తుందని, అదే సందర్భంలో ఇక్క నీళ్ళు ఉన్నాయి, పంటలు ఉన్నాయి, పనులు ఉన్నాయి అని కూలీలు చెప్పటంతో, జగన్ రాజన్న రాజ్యం గురించి ప్రజలు ఇలా అనుకుంటున్నారని తెలుసుకుని షాక్ తిన్నారు. అక్కడ జరిగిన సంఘటన చూసి షర్మిల అవాక్కయి, వెంటనే నెమ్మదిగా అక్కడ నుంచి జారుకున్నారు. ఇదండీ రాజన్న రాజ్యం కధలు. ఎంత పెద్ద పెద్ద ప్రకనలు వేసుకున్నా, ప్రజల ఇబ్బందులు బయట కనపడక మానవు కదా.