వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో చేసిన మరో అరాచకం బయట పడింది. ఇన్నాళ్ళు తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలకు ఆధారాలతో సహా రుజువు అయ్యాయి. తెలుగుదేశం పార్టీ చేస్తున్న పోరాటం ఎందుకో ఇప్పుడు అర్ధం అయ్యింది. ఏడాది క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన అరాచకాలు అన్నీ అందరూ చూసారు. ముఖ్యంగా నామినేషన్ వేయకుండా చేయటం, నామినేషన్ కాగితాలు లాక్కుపోవటం, నామినేషన్ వేసిన తరువాత, వివిధ కారణాలు చెప్పి, నామినేషన్ తిరస్కరించటం. మొత్తంగా అసలు ఎన్నికే జరగకుండా ఏకాగ్రీవాలు చేయటానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయని ప్రయత్నం లేదు. అయితే ఇవి కోర్టుల్లో ఛాలెంజ్ చేయటానికి వీలు ఉండదు. ఎందుకు అంటే, ఎన్నికల ప్రక్రియ మొదలు అయితే, కోర్టుల జోక్యం ఉండదు. అయితే గతంలో ఉన్న రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ, ఇలాంటి ఆగడాలను సహించే వారు కాదు కాబట్టి, అప్పట్లో వేసిన ఒక విచారణ, ఇప్పుడు నిజాలను బయట పడేసింది. గత ఏడాది మార్చిలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో, తిరుపతి కార్పొరేషన్ కు సంబంధించి, 7వ డివిజన్‌ లో తెలుగుదేశం పార్టీ తరుపున విజయలక్ష్మి అనే మహిళ నామినేషన్ వేసారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా, తరువాత అసలు విషయం జరిగింది.

kjupppam 11112021 2

విజయలక్ష్మికి తెలియకుండానే, ఆమె సంతకం ఫోర్జరీ చేసి, నామినేషన్ ఉపసంహరించుకుని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోటీ లేకుండా చేసుకున్నారు. అయితే దీని పైన టిడిపి అభ్యంతరం చెప్పింది. అప్పట్లో ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్ ని నిలదీశారు. తనకు న్యాయం జరగక పొతే ఇక్కడ చస్తాం అని చెప్పారు. ఆ వీడియో బయటకు రావటం, వైరల్ అవ్వటంతో, అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అక్కడ ఎన్నికలు ఆపేసి, జరిగిన ఘటన పై విచారణకు ఆదేశించారు. మరో పక్క రిటర్నింగ్ ఆఫీస్ తన సంతకాన్ని బయటకు ఇచ్చ ఫోర్జరీ చేసారు అంటూ, ఆయన పైన పోలీసులకు ఫిర్యాదు చేసారు. అయితే ఈ విషయంలో ఇరు వర్గాలు కోర్టుకు వెళ్ళాయి. అసలు సంతకం నిజమో కాదో తేల్చాలని కోర్టు, ఫోరెన్సిక్‌ నివేదిక అడిగింది. దీని పైన రిపోర్ట్ నిన్న కోర్టుకు సీల్డ్ కవర్ లో ఇచ్చారు. సంతకం ఫోర్జరీ చేసారని ఫోరెన్సిక్‌ నివేదిక నిర్ధారించింది. దీంతో టిడిపి ఆరోపణ నిజం అని తేలింది. అయితే ఇప్పుడు తాజాగా కుప్పంలో కూడా ఇదే జరిగింది. 14వ వార్డ్ టిడిపి అభ్యర్ధి సంతకం ఫోర్జరీ చేసి నామినేషన్ ఉపసంహరించారని టిడిపి ఆరోపిస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read