ప్రతి విషయంలో క్రెడిట్ కొట్టేద్దాం అనుకునే అలవాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఈ క్రెడిట్ పిచ్చ ఎంతలా అంటే, కియా కంపనేని చంద్రబాబు తెచ్చారని ప్రపంచం మొత్తం తెలిస్తే, కాదు కాదు అప్పట్లో వైఎస్ఆర్, కియా కు లేఖ రాసారు, అందుకే వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టారు, మాది హైలీ రెస్పెక్టెడ్ ఇంటి పేరు అంటూ, ఒక ఉత్తరం చదివి వినిపించారు. ఇక ఇలాంటివి ఎన్నో ఉన్నాయి అనుకోండి. చంద్రబాబు తెచ్చిన కంపెనీలు, జగన్ విజన్ చూసి వస్తున్నాయి అని చెప్పటం లాంటివి కూడా విన్నాం. అలాంటిది తన హయాంలో జరుగుతున్న పనులకు క్రెడిట్ తీసుకోకుండా ఉంటాడా ? ఇది పసిగట్టిన విజయవాడ ఎంపీ కేశినేని నాని ముందే రంగంలోకి దిగి, ఇందులో జగన్ పాత్ర ఏమి లేదు అని డైరెక్ట్ గా చెప్పకుండా,చెప్పకనే చెప్పారు. విషయానికి వస్తే, ఇది విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ గురించి. ఈ సమస్య ఎప్పటి నుంచో ఉంది. నగరంలో ట్రాఫిక్ సమస్య తీర్చటానికి, ఈ ఫ్లై ఓవర్ ఎంతో ఉపయోగ పడుతుందని భావించిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇది హైవే కావటంతో, కేంద్రంతో మాట్లాడి ఒకే చేపించారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని కృషి, ఈ ప్రాజెక్ట్ లో మరువ లేనిది. అనునిత్యం కేంద్రంతో మాట్లాడి, కేంద్ర మంత్రి గడ్కరీతో ఎప్పటికప్పుడు చర్చించి, ముందుకు తీసుకుని వెళ్లారు.

nanai 03112021 2

తెలుగుదేశం హయాంలోనే బెంజ్ సర్కిల్ వన్ ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తయ్యింది. జగన్ మోహన్ రెడ్డి హాయంలో రెండో వైపు ఫ్లై ఓవర్ పనులు మొదలు పెట్టారు. అయితే ఇందులో రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఏమి లేదు. మొత్తం కేంద్రం నుంచే. ఎంపీ కేశినేని నాని మాట్లాడి,మొత్తం చేపించారు. రెండో పక్క ఫ్లై ఓవర్ దాదాపుగా పూర్తయ్యింది. కేవలం పెచప్ వర్కులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో నెమ్మదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ కొట్టేసే ప్రయత్నాలు మొదలు పెట్టింది. మరో పక్క ఈ రోజు ఎంపీ కేశినేని నాని, స్థానిక ఎమ్మెల్యే గద్దె కలిసి ఫ్లై ఓవర్ పరిశీలించారు. సర్వీస్ రోడ్డు నిర్మాణం కూడా కేంద్రంతో మాట్లాడి తామే పూర్తి చేస్తాం అని అన్నారు. ఈ సందర్భంగా కేశినేని నాని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, అలాగే కేంద్ర మంత్రి గడ్కరీకి థాంక్స్ చెప్పారు. ఇది ఇలా ఉంటే, క్రెడిట్ తాము తీసుకుందాం అని అనుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేశినేని నాని షాక్ ఇచ్చారనే చెప్పాలి. ఇప్పుడు వచ్చి ఇది జగన్ విజన్, జగన్ చొరావతోనే అయ్యిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటే ఏమి చేయలేం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read