తెలుగుదేశం నేతల పై కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. టిడిపి నేతలు ఎప్పుడు దొరుకుతారా అని చూస్తున్న వైసిపీ నేతలు, అవకాసం దొరికితే కేసులు పెట్టేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు పై అనేక అక్రమ కేసులు పెట్టారు. ఆయన్ను జైలులో కూడా పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన పైన మరో కేసు నమోదు అయ్యింది. నిన్న శ్రీకాకుళం జిల్లా నందిగామ మండల కేంద్రంలో స్వర్గీయ ఎర్రంనాయుడు వర్ధంతి సందర్భంగా, అక్కడ ఎన్టీఆర్, ఎర్రంనాయుడు విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమానికి టిడిపి కార్యకర్తలు ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి అచ్చెన్నాయుడు స్వగ్రామం నిమ్మాడ నుంచి, అచ్చెన్నాయుడుతో పాటుగా, ఎంపీ రామ్మోహన్‍ నాయుడు కూడా ర్యాలీగా వచ్చారు. టిడిపి శ్రేణులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గున్నారు. ఈ కార్యక్రమానికి వెళ్తున్న క్రమంలో, ప్రతి మండల కేంద్రంలో కూడా పోలీసులు అవాంతరాలు సృష్టిస్తూనే ఉన్నారు. నిమ్మాడ దాటిన వెంటనే కోటబొమ్మాలి సెంటర్ లో అచ్చెన్నాయుడు వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ ర్యాలీకి అనుమతి లేదని, ముందుకు వెళ్ళటానికి వీలు లేదని పోలీసులు తేల్చి చెప్పటంతో, పోలీసులకు టిడిపి నాయకులకు మధ్య పెద్ద ఎత్తున పోట్లాట జరిగింది, పోలీసులు మాత్రం ససేమీరా అని అన్నారు.

case 03112021 2

అయితే దీని పై అచ్చెన్నాయుడు, రామ్మోహన్‍ నాయుడు ఫైర్ అయ్యారు. ఎన్నికల సమయంలో నిబంధాలు ఉంటాయి కానీ, చిన్న చిన్న వాటికి కూడా అదీ వర్ధంతి కార్యక్రమలకు కూడా మీ అనుమతి తీసుకోవాలా అని, వర్ధంతికి కూడా వెళ్ళకూడదా అని అచ్చెన్నాయుడు పోలీసులని ప్రశ్నించారు. వదిలి పెట్టకపోతే ఇక్కడే ధర్నా చేస్తా అని చెప్పటంతో, పోలీసులు వెనక్కు తగ్గారు. ఆ తరువాత వర్ధంతి కార్యక్రమానికి వెళ్లారు. టెక్కలి మీదుగా వెళ్ళటంతో, స్థానిక వీఆర్ఓ మల్లేశ్వరరావు, అచ్చెన్నాయుడు, రామ్మోహన్‍ నాయుడుతో పాటుగా, దాదాపుగా 48 మంది టీడీపీ కార్యకర్తలపైన మోటార్ వెహికల్ చట్టంతో పాటుగా, కొవిద్ ఆంక్షలు ఉల్లంఘించారు అంటూ ఫిర్యాదు చేసారు. దీంతో టెక్కలి పోలీస్ స్టేషన్ పరిధిలో అచ్చెన్నాయుడు, రామ్మోహన్‍ నాయుడుపైన కేసులు నమోదు చేసారు. వీరి ఇరువరితో పాటుగా, 48 మంది పై కేసులు పెట్టారు. మరి ఈ కేసులో కూడా అచ్చెన్నాయుడు, రామ్మోహన్‍ నాయుడు అరెస్ట్ చేస్తారా ? అని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read