వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అరాచకాలు మొదలు పెట్టింది. 12 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు, ఇతర స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యింది. నిన్న దీపావళి రోజున కూడా నామినేషన్ వేయటం పట్ల అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఎన్నికల నామినేషన్ పర్వంలో మళ్ళీ దౌర్జన్యాలు చేస్తుంది అధికార పక్షం. తూర్పు గోదావరి జిల్లాలోని, రంపచోడవరం నియోజకవర్గంలోని కూనవరం మండలం, కాచవరం గ్రామంలో ఒకటో వార్డు అభ్యర్ధి బొడ్డు శిరీషను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్ ఫోన్ చేసి బెదిరించటంపై టిడిపి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ బెదిరింపులకు సంబంధించిన వాయిస్ రికార్డుని, ఎన్నికల కమిషన్ కు అందించింది. అలాగే నిన్న జరిగిన ప్రెస్ మీట్ లు, టిడిపి అభ్యర్ధి బొడ్డు శిరీష నేరుగా చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఆయన వివరించారు. శిరీషకు జరిగిన అన్యాయానికి తాము అందరం అండగా ఉంటాం అని చంద్రబాబు చెప్పారు. ఇక కుప్పం నగర పంచాయతీలో ప్రభుత్వం నియమించిన లోకేష్ వర్మ అనే ఎన్నికల ప్రత్యేక అధికారి పై కూడా తెలుగుదేశం అభ్యంతరం చెప్తుంది. మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో, లోకేష్ వర్మ వ్యవహరించిన తీరు పై, అప్పట్లోనే తెలుగుదేశం అభ్యంతరం చెప్పింది.

cbn 05112021 2

అతని పై చర్యలు తీసుకోక పోగా, ఇప్పుడు తీసుకుని వచ్చి కుప్పంలో వేయటం పై తెలుగుదేశం ఆగ్రహంగా ఉంది. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయాకులతో, సన్నిహితంగా ఉన్న ఫోటోలను చంద్రబాబు నిన్న మీడియా సమావేశంలో బయటకు వదిలారు. అతన్ని ఎన్నికల విధులు నుంచి తొలగించాలని టిడిపి డిమాండ్ చేస్తుంది. ఇక గుంటూరు జిల్లా గురజాలలో మళ్ళీ చెలరేగిపోయారు. టిడిపి అభ్యర్ధులు కోర్ట్ కు వెళ్ళటంతో, అభ్యర్ధికి రక్షణ కల్పించాలని కోర్టు ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలు అమలు కాకపోవటంతో, చంద్రబాబు రంగంలోకి దిగి, నిన్న కలెక్టర్ ఎస్పీలకు ఫిర్యాదులు చేసారు. ప్రెస్ మీట్ పెట్టి, ఎండగట్టారు. దీంతో నిన్న రాత్రి ఆఘమేఘాల పై ఎన్నికల కమిషన్ స్పందిస్తూ, గుంటూరు కలెక్టర్, ఎస్పీకి వెంటనే టిడిపి అభ్యర్ధులు నామినేషన్ వేసేందుకు రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు రక్షణ ఇవ్వాలి అంటూ, ఎన్నికల కమిషన్ కార్యదర్శి కన్నబాబు తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read