మొత్తానికి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. ఇన్నాళ్ళు పెట్రోల్, డీజిల్ పై ప్రజలను పీల్చి పిప్పి చేసిన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను చాలా ఇబ్బంది పెట్టాయి. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ మీద టాక్సులు పెంచుకుంటూ పోతున్న సంగతి తెలిసిందే. అయితే కేంద్రం మాత్రం, ఇప్పుడు పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ భారీగా తగ్గించింది. లీటల్ పెట్రోల్‍పై రూ.5, డీజిల్‍పై రూ.10 తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తగ్గించిన ధరలు రేపటి నుంచే అమలులోకి రానున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల పై కేంద్ర ప్రభుత్వం పై అనేక విమర్శలు వచ్చాయి. దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో కూడా ప్రతికూల ఫలితాలు వచ్చాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. పెరిగిన రేటుతో, ఈ తగ్గింపు పెద్ద తగ్గింపు కాకపోయినా, ప్రజలకు ఎంతో కొంత ఉపసమనం అనే చెప్పాలి. అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం, పెట్రోల్ టాక్సులు బాదుడులో అగ్ర స్థానంలో ఉంది. మన ప్రభుత్వం కూడా తగ్గిస్తే, ఇంకా ప్రజలకు ఉపసమనం లభిస్తుంది. ఏదైతేనేమి మొత్తానికి కేంద్ర ప్రభుత్వం, ప్రజాగ్రహానికి దిగి వచ్చింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read