విజయనగరం జిల్లా, లచ్చయ్యపేటలో చెరకు రైతులు పోలీసుల పై తిరగబడ్డారు. కొబ్బరి మట్టలు తీసుకుని, పోలీసులను వెంబడించారు. దాదాపుగా 5 గంటలుగా వర్షం పడుతున్నా సరే, తమ సమస్యలు పరిష్కరించాలి అంటూ ఉదయం నుంచి రైతులు ధర్నా చేస్తున్నారు. టార్పాలిన్ లు కప్పుకుని మరీ జోరు వానలో కూడా ధర్నా చేస్తున్నారు. మహిళా రైతులు కూడా ఈ ధర్నాలో పాల్గున్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో దాదాపుగా ఒక 200 మంది చుట్టు పక్కల గ్రామాల నుంచి వచ్చిన చరకు రైతులు, తమ బకాయలు ఇవ్వాలి అంటూ  ఎన్‍సీఎస్ చక్కెర కర్మాగారం దగ్గర రాస్తా రోకో చేసారు. 2019-20, 2020-21, రెండు సీజన్లకు సంబంధించిన దాదాపు రూ.16.33 కోట్లు బకాయలు వెంటనే చెల్లించాలని, చరకు రైతులు ఫ్యాకటరీ ముందు ధర్నా చేస్తున్నారు. అయితే శాంతియుతంగా ధర్నా చేస్తున్న రైతులను, అక్కడకు చేరుకున్న పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేసారు. దీంతో రైతులు ఎదురు తిరిగారు. పోలీసులు ప్రవర్తన పై రైతులు ఆగ్రహించి, రహదారి మీద రాస్తారోకో చేసి ట్రాఫిక్ ఆపేసారు. దీంతో పోలీసులు మళ్ళీ రైతుల  పైకి వెళ్ళటంతో, రైతులు ఎదురు తిరిగారు. మట్టిపెళ్లలు, కొబ్బరిమట్టలతో పోలీసుల పై తిరగబడ్డారు. దీంతో పోలీసులు వెనుదిరిగి వెళ్ళిపోయారు. రైతులు ధర్నా ఇంకా కొనసాగుతూనే ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read