విజయనగరం జిల్లాలోని లచ్చయ్య పేట షుగర్ ఫ్యాక్టరీలో మొన్న తమ బకాయల కోసం రోడ్డెక్కిన అరుగురు రైతులపై పోలీసులు కేసులు నమోదు చేసారు. చెరకు బకాయిలు వెంటనే చెల్లించాలని రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేసారు. అయితే శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేయటంతో, పోలీసులపై రైతులు, రైతు సంఘాల నేతలు తిరగబడ్డారు. కొబ్బరిమట్టలు తీసుకుని వెంబడించారు. దీంతో రైతుల ఆగ్రహాన్ని గ్రహించిన పోలీసులు అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు వారి పైన కేసులు పెట్టటం పై విమర్సు వస్తున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్ నేపధ్యంలో ఈ రోజు రైతు సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. ముందస్తుగా రైతు సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేయనున్నారని తెలుస్తుంది. అయితే పోలీసులు కేసులు పెట్టటం పై, చంద్రబాబు తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసారు. బకాయిలు చెల్లించాలని నిరసన తెలిపితే, రైతుల పైనే అక్రమ కేసులు పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేసారు. వాళ్లకు న్యాయం చేయాలి కానీ, ఇలా కేసులు పెడతార అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. పొలాల్లో ఉండాల్సిన రైతులు, రోడ్డు మీదకు వస్తే, వాళ్ళ పైనే కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు.
విజయనగరంలో రైతుల పై కేసులు... చంద్రబాబు ఆగ్రహం..
Advertisements