రెండు నెలల క్రితం ప్రశాంత్ కిషోర్ వస్తున్నారు, మనం రోడ్డు మీదకు వెళ్ళాలి, నేను కూడా ప్రజల మధ్య తిరుగుతాను, ఇక ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోవాలి అంటూ జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్టు అన్ని పత్రికల్లో ప్రముఖంగా వచ్చాయి. ఇక అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఫేక్ రాతలు మొదలయ్యాయి అంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. ఇటీవల తెలుగుదేశం పార్టీ అఫిషియల్ సోషల్ మీడియా పేజిలో, ఇలాంటి ఫేక్ రాతలకు చెందిన వాటి గురించి అలెర్ట్ చేస్తూ, నేరుగా ప్రశాంత్ కిషోర్ , జగన్ పై అభియోగాలు వేస్తూ పోస్ట్ లు పెట్టారు. అటు వైపు నుంచి కనీస ఖండన లేదు, కనీస సమాధానం కూడా లేదు. మరి వాళ్ళు తామే చేసామని ఒప్పుకున్నట్టా, లేదా ఎందుకు ఖండించలేదో వారికే తెలియాలి. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఫేక్ లు అధికం అయిపోయాయి. తెలుగుదేశం పార్టీ వ్యక్తిలా సోషల్ మీడియా ఎకౌంటు పెట్టటం, బాలకృష్ణ ఫోటో పెట్టుకుని పవన్ కళ్యాణ్ ని తిట్టటం, అలాగే జనసేన పార్టీ అంటూ, పవన్ బొమ్మ పెట్టుకుని చంద్రబాబుని తిట్టటం, ఈ మధ్యలో కులాన్ని కించపరచటం, ఆ మసుగులో మిగతా వారు మా కులాన్ని అంటారా అంటూ రెచ్చిపోవటం, ఇలాంటివి చూస్తున్నాం. ఇప్పుడు ఇలాంటి ఆరోపణే ఇప్పుడు ఆధారాలతో సహా, తెలుగుదేశం పార్టీ మరొకటి చేసింది.

pk 05112021 2

ట్విట్టర్ లో టిడిపి సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడి పేరుతో ఒక మెసేజ్ తిరుగుతుంది. ముఖ్యంగా వైసీపీ ముసుగులో ఉన్న కొన్ని అకౌంట్లు ఈ మెసేజ్ తిప్పుతున్నాయి. అందులో జనసేన పార్టీతో పొత్తు విషయంలో, పవన్ కళ్యాణ్ ని, జనసేన పార్టీని కించపరుచుతున్నట్టు, తాము ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లు కావాలని అయ్యన్న అన్నట్టు వార్తలు వచ్చాయి. నిజానికి అయ్యన్న ఆ మాటలు అనలేదు. అంటే టిడిపి, జనసేన కలిస్తే ఏమి అవుతుందో వీళ్ళకు ముందే తెలుసు కాబట్టి, ఇలా ఫేక్ చేసి రెండు పార్టీల మధ్య గ్యాప్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ మెసేజ్ కాస్తా వైరల్ అవ్వటంతో, టిడిపి స్పందించింది. తమ అఫిషియల్ పేజిలో, అయ్యన్న అ వ్యాఖ్యలు చేయలేదని, ఇది జగన్, ప్రశాంత్ కిషోర్ కలిసి ఆడుతున్న ఫేక్ ప్రచారం అని, ఈ ఫేక్ ప్రచారం చేసే వారితో జాగ్రత్తగా ఉండాలి అంటూ, ప్రశాంత్ కిషోర్ కి డైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మరి ఇప్పుడైనా ఈ అంశం పై ప్రశాంత్ కిషోర్ టీం స్పందిస్తుందా ? వివరణ ఇస్తుందా ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read