రాష్ట్రంలో అమరావతిని మూడు ముక్కలు చేయటం, మూడు ముక్కల రాజధాని బిల్లు ఇప్పటికే కోర్టు పరిధిలో ఉన్న అంశం తెలిసిందే. రాజధాని అమరావతి రైతులు హైకోర్టులో ఈ అంశం పై కేసు వేయటంతో, దీని పైన తీర్పు వచ్చే వరకు ముందుకు వెళ్ళవద్దు అంటూ, ప్రభుత్వం మూడు ముక్కల బిల్లు పైన స్టే విధించింది. అప్పటి నుంచి కూడా మూడు రాజధానుల అంశం పై వైఎస్ఆర్ కాంగ్రెస పార్టీ నేతలు ఎంత చెప్పుకున్నా కూడా, హైకోర్టులో స్టే ఉండటంతో, ఈ అంశం ఇంకా కోర్టు పరిధిలోనే ఉండటంతో, ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే కొనసాగుతుంది. అయితే గతంలో కేంద్రం ఇలాగే మూడు రాజధానులు అంటూ పిల్లి మొగ్గలు వేయగా, కోర్టులో ఉన్న అంశం అని చెప్పటంతో, అమరావతి అనే చెప్పారు. అయితే ఈ నేపధ్యంలోనే ఇప్పుడు విశాఖ నేవీ అధికారులు, విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా పేర్కుంటూ చేసిన ప్రెస్ నోట్ పై, తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. హైకోర్టులో న్యాయ పరమైన వివాదాలు, అదే విధంగా కేసు వాయిదా ఇంకా కోర్టులో ఉన్న తరుణం, ఈ నెలలోనే విచారణ ఉండటం, ఇవన్నీ ఉండగా నేవీ అధికారులు ఎక్జిక్యూటివ్ క్యాపిటల్ గా పేర్కొనటం, తాము గుర్తించినట్టు, ఇన్విటేషన్ లో పేర్కొనటంతో, న్యాయ నిపుణులు, కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఈ విషయం పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. నేవీ అధికారులు విశాఖను ఎక్జిక్యూటివ్ క్యాపిటల్ గా గుర్తించే ముందు వారికి న్యాయ పరమైన వివాదాలు గుర్తుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. న్యాయ పరమైన వివాదాలు, హైకోర్టులో స్టేటస్ కో ఉన్న నేపధ్యంలో, నేవీ అధికారులు ఈ విధమైన ప్రకటన చేయటం అర్ధ రహితం అని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే రాష్ట్ర రాజధాని రైతులు ఒక వైపు పాదయాత్ర చేయటం, ఆ పాదయత్రకు అపూర్వ స్పందన వస్తున్న తరుణంలో, ఇప్పుడు నేవీ అధికారులు చేసిన ప్రకటనతో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. నవంబర్ 15వ తేదీ నుంచి రాష్ట్ర హైకోర్టులో, ఈ అంశం పై విచారణ మొదలవ్వనుంది. దీని పై రెగ్యులర్ విచారణ ఆ రోజు నుంచి ప్రారంభం కానుంది. దీంతో నేవీ అధికారులు తీరు పైన విమర్శలు వస్తున్నాయి. వాళ్ళకు తెలియక చేసారా ? లేదా ఎవరైనా కావాలని చేసారా అనే అంశం పై చర్చ జరుగుతుంది. కేంద్రం లాగా, వీరు కూడా తప్పు దిద్దుకుంటారేమో చూడాలి.