ఈ రోజు పత్రికలు చూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక వింత అనుభవం ఎదురైంది. దేశం మొత్తం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తున్నారు, మీరు ఎప్పుడు తగ్గిస్తారు అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై ఒత్తిడి పెరుగుతుంది. ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ దీని పై ఆందోళన చేస్తుంది. పక్క రాష్ట్రాల్లో రూ.15 వరకు తగ్గించారని, ఏపి ప్రజలకు కూడా తగ్గించాలని టిడిపి ఆందోళన చేస్తుంది. అయితే వీళ్ళు తగ్గిస్తారో, తగ్గించరో కానీ, ఈ రోజు పేపెర్ లో వేసిన ప్రకటన చూస్తే, ఏపి ప్రభుత్వానికి తగ్గించే ఉద్దేశం లేదని అర్ధం అవుతుంది. ఈ రోజు ప్రకటనలో చాలా ఫేక్ ఉన్నాయని, సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఒక ప్రభుత్వ ప్రకటనలో, కోట్లు ఖర్చు పెట్టి, అబద్ధాలు చెప్పటం పై, విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు హయాంతో పోల్చితే, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, కేవలం రూ.1 పన్ను పెంచినట్టు ఆ ప్రకటనలో తెలపటంతో, అందరూ షాక్ తిన్నారు. చంద్రబాబు హయాంలో రూ.2 మాత్రమే అదనపు వ్యాట్ వేస్తే, ఎప్పుడో వేసిన రూ.4 వ్యాట్ చూపించి, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత, అసలు వ్యాట్ పెంచనట్టు చూపిస్తూ, అతి తెలివి చూపించారు. దీని పై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందిస్తూ, ఈ ప్రకటనలో ఉన్న ఫేక్ మొత్తం బయట పెట్టారు.
లోకేష్ విడుదల చేస్తిన ప్రకటనలో ఉన్న అంశాలు ఇవి. చంద్రబాబు అధికారంలో ఉండగా, బాదుడే బాదుడు అని దీర్ఘాలు తీసి, రెండున్నరేళ్ళు అయినా, ఎందుకు వ్యాట్ తగ్గించ లేదు అంటూ లోకేష్ ప్రశ్నించారు. చంద్రబాబు గారి హాయంలో, వ్యాట్ కేవలం రూ.2. వ్యాట్ భారం పడకుండా రూ.4 నుంచి రూ.2కి తగ్గించింది చంద్రబాబు ప్రభుత్వం, అది ఎందుకు ప్రకటనలో పెట్టలేదని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తరువాత కేవలం రూ.1 సెస్ వేశానని ఫేక్ చేసారని, అసలు వాస్తవం 2020 ఫిబ్రవరి 29న పెట్రోలుపై అదనపు వ్యాట్‌ను రూ.2.76, డీజిల్‌పై రూ.3.07 కు పెంచారని, 2020 జులై 20న, మరోసారి పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు రూ.4 చొప్పున అదనపు వ్యాట్ మరోసారి పెంచుతూ ఆదేశాలు ఇచ్చారని, 2020 సెప్టెంబరు 18న, రోడ్డు అభివృద్ధి సెస్ పేరిట లీటరు రూ.1 చొప్పున విధించారని లోకేష్ తెలిపారు. మొత్తంగా, లీటర్ పెట్రోల్ పై రూ.30 వరకు, డీజిల్ పై రూ.22 వరకు పన్నులు రూపంలో బాదుతూ, ఇవి ఎందుకు ప్రజలకు చెప్పకుండా, తప్పుడు ప్రకటనలో జగన్ చెప్పారని లోకేష్ ప్రశ్నిస్తూ, వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేసారు.