చంద్రబాబు కుప్పం పర్యటన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు మధ్య కొనసాగుతుంది. ఉదయం నుంచి చంద్రబాబు పర్యటనను అడ్డుకోవటానికి వైసీపీ చేయని ప్రయత్నం లేదు. పెద్ద ఎత్తున ప్రజలు రావటంతో, వైసీపీ మరింతగా రెచ్చిపోయింది. బ్యానర్లు చింపటం, కరెంటు ఆపటం, టిడిపి శ్రేణులను అడ్డుకోవటం, ఇలా అన్నీ చేసారు. అయినా ఎక్కడా వెనక్కు తగ్గలేదు. కొద్ది సేపటి క్రితం కుప్పం బస్టాండ్ వద్ద నిర్వహించిన సభలో చంద్రబాబు ప్రసంగించారు. అయితే ఈ సభ మొదలై చంద్రబాబు ప్రసంగం మొదలు పెట్టిన తరువాత కొంత మంది హాల్ చల్ చేసారు. అతని దగ్గర బాంబు ఉందని, అనుమానం రావటంతో ఒక్కసారి గా ఉలిక్కి పడ్డారు. చంద్రబాబుకు సెక్యూరిటీగా ఉన్న ఎన్ఎస్జీ కమండాలో పొజిషన్ తీసుకున్నారు. బులిట్ ప్రూఫ్ జాకెట్లు తీసారు. చంద్రబాబుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. చంద్రబాబు చుట్టూ వచ్చేసారు. ఈ లోపు టిడిపి శ్రేణులు ఆ వ్యక్తులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతని వద్ద డమ్మీ బాంబు ఉందని, మరొకరి దగ్గర రాళ్ళు, కర్రలు ఉన్నట్టు గుర్తించారు. ఈ సమయంలో ఏమి జరుగుతుందో చంద్రబాబుకు కూడా అర్ధం కాలేదు. స్టేజ్ పై నుంచే రాళ్ళూ ఉన్నాయా, బాంబులు తెచ్చారా అని వాకబు చేసారు. పోలీసులకు అప్పగించటంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు అక్కడ ఉన్న పోలీసులను వాళ్ళు ఎలా వచ్చారు అని ప్రశ్నించారు. పోలీసులు ఇలాగే చూసి చూడనట్టు వదిలేస్తే మంచిగా ఉండదని అన్నారు. తప్పుడు పనులు చేసే వారి పై ఎంక్వయిరీ కమిషన్ వేస్తాం అని, వారిని వదిలిపెట్టే సమస్యే లేదని చంద్రబాబు అన్నారు. న్యాయంగా ఉంటే తలొగ్గి ఉంటాం అని, దుర్మార్గాలు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు. ఆర్ధికంగా, శారీరకంగా, మానసికంగా క్షోభ పెడుతున్నారని , దీని కోసం పోలీసులను వాడుకుంటున్నారని, పోలీసులు కూడా ఇటువంటివి మానేస్తే మంచిది అని అన్నారు. కుప్పంలో లేని సంస్కృతీన తీసుకుని వచ్చారని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేసి వదిలి పెడుతున్నారని అన్నారు. చంద్రబాబు కుప్పం వస్తే బాంబులు వేస్తాం అంటూ ఇటీవల వైసీపీ నేతలు చెప్పటంతో, ఈ సంఘటనతో ఒక్కసారిగా అందరూ షాక్ తిన్నారు. టిడిపి కార్యకర్తలు అతన్ని పట్టుకోవటంతో, ప్రమాదం తప్పింది. లేకపోతే ఏమి జరిగేదో మరి.