కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత అనేక బ్యాంకులు వెళ్ళిపోయాయి. రాజధాని పై సందిగ్ధం ఏర్పడింది. తరువాత మూడు రాజధానులు అన్నారు. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తం అయ్యింది. తరువాత రైతులు ఆందోళన బాట పట్టారు. రాజధాని అమరావతిలోనే ఎందుకు ఉండాలి అనే విషయం పై అవగాహన కల్పించారు. అమరావతి రాష్ట్రంలో మధ్యలో అందరికీ అందుబాటులో ఉంటుంది. అవసరం అయితే హైకోర్ట్ బెంచ్ ని విశాఖలో కానీ, రాయలసీమలో పెట్టుకోవచ్చు. అవసరం అయితే అసెంబ్లీ కూడా, శీతాకాలం వేరే చోట పెట్టుకోవచ్చు. ఇలాంటి ఉదంతాలు దేశంలో చాలా ఉన్నాయి. ఇది భూమి విలువల కోసం చేస్తున్న పోరాటం కాదు, రాష్ట్రం కోసం చేస్తున్న పోరాటం. ఉమ్మడి ఏపిలో హైదరాబద్ వల్లే రాష్ట్రం బాగు పడింది. మంచి సిటీ ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. అప్పుడే రాష్ట్రం బాగు పడుతుంది. ఇక్కడకు వచ్చే ముందు అమరావతిలో అన్ని నిర్మాణాలు చూసి వచ్చాను. దాదాపుగా 90 శాతం నిర్మాణాలు పూర్తయ్యాయి. పది వేల కోట్ల పనులు పూర్తయ్యాయి. ఇటువంటి పరిస్థితిలో ఏమి చేయాలి అని రైతుల్లో అనిశ్చితి ఉంది. ఇప్పుడు రైతులు మరో అడుగు ముందుకు వేసి పాదయాత్ర చేస్తున్నారు. రాష్ట్రంలో అవగాహన కల్పించటానికి రైతులు పూనుకున్నారు. ఎక్కడ చూసినా నష్టపోయేది రైతులే. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఇదే జరిగింది.

jdl 29102021 2

పోలవరంలో కూడా ఇదే జరిగింది. అమరావతిలో కూడా ఇప్పుడు రైతులకు అదే జరిగింది. అందుకే ఈ పాదయాత్ర చేస్తున్నారు. అందుకే రైతులకు మద్దతు ఇవ్వటానికి వచ్చాను. ప్రధానంగా మహిళలు ఈ ఉద్యమంలో ముందున్నారు. మన మహిళలను రోడ్డున పడేయటం మంచి విషయం కాదు. ఇది మన సంస్కృతీ కాదు. వాళ్ళ మీద బాల ప్రయోగాలు చూస్తుంటే, బాధ వేస్తుంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ సమస్య పై దృష్టి సారించాలి. ఇన్సైడర్ ట్రేడింగ్ అని ఆరోపణలు చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టించారు, చివరకు కోర్టుల్లో ఏమి లేదని తేలింది. ఉపాధి, ఉద్యోగాలు, అభివృద్ధి పైన ప్రభుత్వం దృష్టి సారించాలి. రైతులు పాదయాత్ర కంటే ముందే, ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే బాగుటుంది. ఇది రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కాదు. ఇది రియల్ ప్రాజెక్ట్. మహిళలను, రైతులను ఇబ్బంది పెట్టే పాలన ఉండాలా అనేది ఆలోచించాలి. ప్రభుత్వాలు రైతుల విషయంలో యోగ్యమైన నిర్ణయం తీసుకోవాలి. ఇది 29 గ్రామాల సమస్య కాదు, రాష్ట్ర వ్యాప్త సమస్య అని ప్రజలు గుర్తుంచుకోవాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read