చంద్రబాబు కుప్పం పర్యటన ఉద్రిక్త పరిస్థితుల మధ్యే కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా చంద్రబాబు పర్యటన కోసం టిడిపి శ్రేణులు కట్టుకున్న ఫ్లేక్సీలను ఎక్కడికక్కడ గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేస్తున్నారు. ఇది వైసీపీ వారి పనే అని టిడిపి ఆరోపిస్తుంది. దీంతో భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్న టిడిపి కార్యకర్తలు, నాయకులు ఆందోళన వ్యక్తం చేసారు. అయినా ఇంకా సంఘటనలు ఆగక పోవటంతో, టిడిపి శ్రేణులు కూడా వైసీపీ ఫ్లెక్సీలు చించివేసారు. కుప్పం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ వద్ద ఉన్న వైసిపీ బ్యానర్లను టిడిపి చించి వేసే ప్రయత్నం చేయగా, వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి, ఇరు వర్గాలను చెదరగొట్టారు. భారీ సంఖ్యలో చంద్రబాబు పర్యటన కోసం వచ్చిన టిడిపి శ్రేణులు, తమ అధినేత ఫ్లేక్స్ లు చించివేయటం పై ఆగ్రహం వ్యక్తం చేసాయి. దీంతో వీరు కూడా వైసిపీ ఫ్లెక్సీలను కూడా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసారు. అయితే పోలీసులు వెంటనే రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ప్రస్తుతం చంద్రబాబు ఆర్ అండ్ బి అతిధి గృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతం కుప్పంలో భారీ వర్షం పడుతూ ఉండటంతో, చంద్రబాబు గెస్ట్ హౌస్ కే పరిమితం అయ్యారు.

kuppam 29102021 2

వాస్తవానికి ఈ పాటికే చంద్రబాబు బహిరంగ సభ ప్రారంభం కావాల్సి ఉంది. పెద్ద ఎత్తున ప్రజలు రావటంతో, ఆయన బెంగుళూరు ఎయిర్ పోర్ట్ నుంచి కుప్పం రావటానికి చాలా సమయం పట్టింది. అక్కడకు చేరుకోగానే వర్షం కూడా మొదలు కావటంతో, కార్యక్రమం ఆలస్యం అయ్యింది. వర్షం ఆగిన తరువాత, ఆయన రోడ్ షో మొదలు పెట్టి, భారీ బహిరంగ సభలో పాల్గుననున్నారు. తరువాత ముగ్గురు నేతల ఇళ్ళకు కూడా చంద్రబాబు వెళ్లనున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. పోలీసులు కూడా కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. చంద్రబాబు కుప్పం పర్యటనలో ఎప్పుడూ ఇలాంటి వాతావరణం కనిపించ లేదని, వైసిపీ అధికార బలంతో, తమను ఇబ్బందులు పెడుతున్న నేపధ్యంలో, కార్యకర్తల్లో ఎమోషన్ పెరిగిపోయిందని, బదులు తీర్చుకోవటానికి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. చంద్రబాబు పర్యటనకు అనేక ఇబ్బందులు కల్పిస్తున్న వేళ, భారీగా వచ్చిన టిడిపి శ్రేణులతో, ఏ నిమిషాన ఏమి జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read