ఆంధ్రపదేశ్ రాష్టంలో జరుగుతున్న అరాచకాల పై తెలుగుదేశం పార్టీ రాష్ట్రపతిని కలిసి ఆయనకు ఫిర్యాదు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల పై, దాదాపుగా అరగంటకు పైగా, చంద్రబాబు రాష్ట్రపతికి వివరించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంతో పాటు, ఒకే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దా-డు-ల పై, సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరారు. ఇక రాష్ట్రంలో విచ్చలవిడిగా లభ్యం అవుతున్న గంజాయి పై కూడా ఫిర్యాదు చేసారు. అధికార పార్టీతో కలిసి, డీజీపీ చేస్తున్న పనులు వివరిస్తూ, డీజీపీని రీకాల్ చేయాలని ఆయన, రాష్ట్రపతికి ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. గత రెండున్నరేళ్ళుగా ఏపిలో వైసిపి ప్రభుత్వం చేసిన అరాచకాల పై, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రర్ ఇన్ ఏపీ అనే 300 పేజీల పుస్తకాన్ని కూడా చంద్రబాబు రాష్ట్రపతికి అందచేసారు. ఇక్కడ మాదకద్రవ్యాల ద్వారా డబ్బు సంపాదిస్తూ, ఆ డబ్బుని ఉగ్రవాద సంస్థలు చేరవేస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేసారు. రాష్ట్రంలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ, అధికార పార్టీతో కుమ్మక్కు అయ్యి, రాష్ట్రంలో రాజ్యాంగం అమలు లేకుండా ప్రవరిస్తున్నారని, పోలీస్ వ్యవస్థను కూడా వైసిపీ ప్రభుత్వం ఆడిస్తుందని, ఏకంగా ఎంపీ రఘురామకృష్ణం రాజుని పోలీసులను అడ్డుపెట్టుకుని ఏమి చేసారో అందరం చూసాం అని అన్నారు.
నిరసన తెలిపే హక్కు కూడా ఇవ్వటం లేదని, అమరావతిలో రైతులు, మహిళల పరిస్థితి ఘోరంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి అమరావతి విషయం పై ఆరా తీసినట్టు తెలుస్తుంది. అమరావతిని అన్నిటిలాగే, దీన్ని కూడా జగన్ మోహన్ రెడ్డి సర్వ నాశనం చేసారని రాష్ట్రపతికి టిడిపి నేతలు తెలిపారు. గతంలో రాష్ట్రపతి అమరావతి వచ్చిన సందర్భంగా, అయన అమరావతిలో పర్యటించారు. అలాగే అమరావతి పై రకరకాల వార్తలు అప్పట్లో వచ్చేవి. అందుకే అమరావతి పై రాష్ట్రపతి అడిగి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక రాష్ట్రంలో దళితుల పై జరుగుతున్న ఘటనలు ప్రస్తావిస్తూ, వరప్రసాద్ అనే దళితుడికి శిరోముండనం చేసిన సందర్భంలో, మీ వరకు ఫిర్యాదు వచ్చినా, మీరు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాన్ని కోరినా, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రాష్ట్రపతికి గుర్తు చేసారు. దీని పై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతిని కోరారు. మీరు లేవనెత్తిన అంశాలు అన్నీ సీరియస్ అంశాలు అని, దీని పై తగు చర్యలు తీసుకుంటాను అంటూ రాష్ట్రపతి చెప్పినట్టు టిడిపి బృందం చెప్పింది.