ఏపి ప్రభుత్వానికి వరుస పెట్టి కష్టాలు ఎదురు అవుతున్నాయి. నిన్న ఎయిడెడ్ స్కూల్స్ పై ప్రజలు రోడ్డు ఎక్కి ఆం-దో-ళ-న చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏపి ప్రభుత్వానికి మరో త-ల-నొ-ప్పి మొదలైంది. తమ సమస్యలు పరిష్కరాం అవ్వటం లేదని, అవి పరిష్కారం అయ్యే వరకు ఈ రోజు నుంచి ఏపిలో రేషన్ దిగుమతితో పాటుగా, పంపిణీ కూడా నిలిపివేస్తున్నమాని రేషన్ డీలర్ల సంఘం నిన్న ప్రకటించి, రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. 2020 పీఎంజీకేవై కు సంబంధించి ఇప్పటికీ ఆ కమీషన్ బకాయిలు చెల్లించలేదని, వాటిని వెంటనే చెల్లించాలని కమీషన్ బకాయిలు విడుదల చేయాలి అంటూ, రేషన్ డీలర్ల సంఘం తమ ప్రధాన డిమాండ్ గా చెప్తుంది. డీడీ నగదు వాపసుతో పాటుగా, ధరల వ్యత్యాస సర్క్యులర్లను ఏపి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అలాగే రేషన్ డీలర్ల నుంచి ఐసీడీఎస్‌కు కందిపప్పును మళ్ళించారని, దానికి సంబంధించిన బకాయిలను కూడా వెంటనే తమకు చెల్లించాలని డీలర్లు కోరుతున్నారు. ఒకటి కాదు రెండు కాదని, నెలలు నెలలుగా తమకు రావాల్సిన కమిషన్ ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం లేదని వాళ్ళు వాపోతున్నారు. 2020 మార్చి 29 నుంచి, ఈ రోజు వరకు కూడా తమకు ఏపీ పౌరసరఫరాల కార్పొరేషన్ నుంచి బకాయిలు రాలేదని అన్నారు.

ration 26102021 2

ఇక అలాగే గోనె సంచుల విషయంలో కూడా ప్రభుత్వం తమను మోసం చేసిందని వాపోతున్నారు. గోనె సంచులను కనుక తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేస్తే, సంచికి రూ.20 చొప్పున ఇస్తాం అన్నారని, అయితే ప్రభుత్వం ఇప్పుడు సంచులు తీసుకుని వాటికి చెల్లింపులు చేయం అంటూ చెప్పటం సరైంది కాదని, డీలర్లు ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఒక పక్క డబ్బులు ఇవ్వకుండా, గోనె సంచులు తిరిగి ఇవ్వకుంటే, తమకు ఇచ్చేవి కట్ చేయటమే కాకుండా, కేసులు పెడతాం అంటూ బెదిరిస్తున్నారని వాపోయారు. ఒక పక్క తెలంగాణాలో చక్కగా తీసుకుంటున్నారని, దానికి సంబంధించి జీవో కూడా ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. ఏపిలో కూడా ఇలాంటి జీవోని విడుదల చేసి అమలు చేయాలని రేషన్ డీలర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇవే గొనె సంచలు బయట ఇస్తే, 30 రూపాయల వరకు వస్తుందని గుర్తు చేస్తున్నారు. అందుకే ఈ రోజు నుంచి విధులు నిర్వహించం అని చెప్తున్నారు. అయితే ఇవి బియ్యం వ్యాన్లు ద్వారా వచ్చేవి కావు, ఇవి కేంద్రం ఇచ్చే కోటా. ఇప్పుడు ప్రజలకు ఇది జగన్ ఇస్తున్నారో, కేంద్రం ఇస్తుందో తెలిసిపోతుంది. మరి ప్రభుత్వం ఏమి చేస్తుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read