ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన, 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, కాగ్ తన నివేదికను ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీ ముందు ప్రవేశ పెట్టింది. ఈ నివేదికలో జగన్ ప్రభుత్వం చేసిన డొల్ల తనం మొత్తం బట్టబయలు అయ్యింది. ముఖ్యంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, వనరుల నిర్వహణ పై, కాగ్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఆర్ధిక వ్యవహారాలలో రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు అంటూ, కాగ్ కొన్ని అంశాలను ఈ నివేదికలో పొందు పరిచింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, అనుబంధ పద్దులు వ్యయం చేసిన తరువాత, జూన్ 2020లో శాసనసభలో ప్రవేశ పెట్టారని, ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అని కాగ్ తన నివేదికలో పేర్కొనటం జరిగింది. రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహారాలు చోటు చేసుకున్నాయని, దీనికి సంబంధించి అసెంబ్లీ ప్రక్రియను బలహీన పరిచే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని, కాగ్ తన నివేదికలో పొందు పరిచింది. అలాగే, ప్రజా వానరలు వినియోగం విషయంలో ఆర్ధిక క్రమశిక్షణ తప్పారని, ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఉంది అంటూ, కాగ్ ఆ నివేదికలో స్పష్టం చేసింది. దీంతో పాటుగా, శాసనసభ ఆమోదించిన కేటాయింపులు కంటే అదనంగా ఖర్చులు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయని కాగ్ తెలిపింది.

cag 26112021 1

అదనంగా అనేక ఖర్చులు చేసారని, తన నివేదికలో పొందు పరచటం జరిగింది. అలాగే, 2018-19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, 2019-20 ఆర్థిక సంవత్సరంలో 3.17 శాతం రెవెన్యూ రాబడులు తగ్గాయిని కాగ్ తెలిపింది. అంటే రాబడి చంద్రబాబు హాయాంలో కంటే తగ్గింది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, ఇంకా అప్పటికి క-రో-నా లేదు. అలాగే ఇదే సందర్భంలో ఖర్చులు మాత్రం 6.93 శాతం పెరిగాయి అంటూ కాగ్ ఆక్షేపించింది. అంటే రాబడి తగ్గింది, ఖర్చులు మాత్రం పెరిగిపోయాయి. ఇక మరో విషయం బకాయాల వివరాలు కూడా బడ్జెట్ పాత్రల్లో సరిగ్గా చూపించ లేదని, శాసనసభ వ్యవస్థను నీరుగార్చే విధంగా ఈ వ్యవహారం ఉందని కాగ్ తెలిపింది. గతంలో ఇదే అంశం పై తెలుగుదేశం కూడా అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇక మరో పక్క 2018-19 నాటితో పోల్చితే 2019-20నాటికి రూ.32,373 కోట్ల మేర పెరిగిన బకాయిల చెల్లింపులు పెరిగాయని కాగ్ చెప్పింది. ఒక్క ఏడాదిలో ఇంత పెరిగాయి అంటే, మన అప్పులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. 2019-20కే ఇన్ని బొక్కలు ఉన్నాయి అంటే, 2020-21లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read