రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీకి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఫోన్ చేసారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాల పై, ఆమె దృష్టికి తీసుకొచ్చారు. నెల్లూరులో, కుప్పంలో, దర్శిలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన అక్రమాల పై రాష్ట్ర ఎన్నికల కమీషనర్ దృష్టికి తెచ్చారు. ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. అక్కడ సకాలంలో అభ్యర్ధుల జాబితాను ప్రకటించికుండా ఫోర్జరీ సంతకాలు పెట్టి, తెలుగుదేశం అభ్యర్ధుల నామినేషన్లు తిరస్కరించారని ఆమెకు ఫిర్యాదు చేసారు. ఎక్కడైతే అభ్యర్ధుల తుది జాబితా ప్రకటించకుండా ఎకాగ్రీవాలు చెప్తున్నారో, అక్కడ వెంటనే ఎన్నికలు ఆపాలని, వెంటనే విచారణ జరిపి, బాధ్యులైన అధికారుల పై చర్యలు తీసుకోవాలని నీలం సాహనీని చంద్రబాబు కోరారు.
Advertisements