రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 మున్సిపాలిటీలకు జరుగుతున్న ఎన్నికల్లో అధికార పార్టీ చేస్తున్న అరాచకాలు నిన్న తారా స్థాయికి వెళ్ళాయి. ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత టిడిపి నుంచి నామినేషన్లు వేయకుండా చూసారు. అయితే ఈ సారి టిడిపి అభ్యర్ధులు ధైర్యం చేసి వేయాటంతో, వారిని కిడ్నాప్ చేయటం, నామినేషన్ కాగితాలు చింపివేయటం ఇలాంటి అరాచకాలు చేసారు. అయితే టిడిపి వ్యూహత్మకంగా డమ్మీ అభ్యర్ధులను కూడా నిలబెట్టింది. తరువాత నామినేషన్లు చెల్లకుండా చూడాలి అనే వైసీపీ ఎత్తుగడను కూడా చేదించారు. ఇక నామినేషన్ల ఉపసంహరణ వచ్చింది. ఇక్కడ కూడా టిడిపి అభ్యర్ధులు లొంగ లేదు. దీంతో కొన్ని చోట్ల వారి సంతకాలు ఫోర్జరీ చేసి, పోటీలో లేనట్టు నిన్న అధికారులు ప్రకటించిన తీరు చూసి, ఇది ప్రజాస్వామ్యమేనా అనిపించింది. ముఖ్యంగా కుప్పంలో అరాచకాలు తారా స్థాయికి చేరాయి. చంద్రబాబుని ఓడించి, పరువు తీయాలనే ఉద్దేశంతో, దిగజారి ప్రవర్తిస్తున్నారు. నిన్న 5 గంటలు లోపు తుది జాబితా ఇవ్వాల్సి ఉన్నా, నిన్న ఎనిమిది గంటల వరకు తుది జాబితా ప్రకటించ లేదు. దీంతో టిడిపి ఆందోళన చేయటంతో, చివరకు కుప్పం 14వ వార్డు టిడిపి అభ్యర్ధి ఉపసంహరించుకున్నట్టు అధికారులు తెలపటంతో, తెలుగుదేశం నేతలు, చివరకు ఆ అభ్యర్ధి కూడా షాక్ అయ్యారు.

kuppam 09112021 2

ఇక్కడ అధికారుల వింతతో, వింతల్లో వింత చోటు చేసుకుంది. కుప్పం 14వ వార్డు అభ్యర్ధి ప్రకాష్ నామినేషన్ వేసిన తరువాత సేఫ్ ప్లేస్ కి వెళ్ళిపోయారు. ఆయన దాదాపుగా కుప్పం నుంచి 300 కిమీ దూరంలో ఉన్నారు. అయితే నిన్న అతను సంతకం పెట్టి, నామినేషన్ ఉపసంహరించుకున్నారు అంటూ అధికారులు చెప్పటంతో, అసలు కుట్ర బయట పడింది. అతని సంతకం ఫోర్జరీ చేసినట్టు టిడిపి నేతలు చెప్తున్నారు. నిన్న రాత్రి ప్రకాష్ కూడా వీడియో విడుదల చేస్తూ, తాను కుప్పం నుంచి 300 కిమీ దూరంలో ఉంటే, ఎలా ఉపసంహరించుకుంటాను అంటూ ప్రశ్నించింది. దీంతో ఒక్కసారిగా కుప్పంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రోడ్డుపై బైఠాయించి టీడీపీ శ్రేణుల ఆందోళన చేసాయి. కుప్పం మున్సిపల్ కమిషనర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. టిడిపి శ్రేణులు, పోలీసులు మధ్య జరిగిన తోపులాటలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి చొక్కా చిరిగింది. మొత్తం మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలోనే ఈ అరాచకాలు చేస్తున్నారని, టిడిపి ఆరోపిస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read