నిన్న అనంతపురం జిల్లాలో, SSBN కాలేజీ దగ్గర, ప్రభుత్వ నిర్ణయమైన ఎయిడెడ్ విద్యాసంస్థలకు వ్యతిరేకంగా విద్యార్ధులు చేసిన నిరసనలో, పోలీసుల చేతిలో గాయపడ్డ విద్యార్ధిని జయలక్ష్మి ఆచూకీ ఇంతవరకు లభించలేదు. ఉదయం నుంచి మీడియాలో జయలక్ష్మి ఆచూకీ లభించటం లేదు అంటూ, పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే పోలీసులు మాత్రం తమకేమీ తెలియదంటూ, ఎలాంటి ప్రకటన చేయటం లేదు. ఇప్పటి వరకు జయలక్ష్మి క్షేమ సమాచారం బయటకు రాలేదు. అయితే నిన్న పోలీసుల దా-డిలో గాయపడ్డ జయలక్ష్మి, తల్లిదండ్రులు, నిన్న సాయంత్రం నుంచి అదృశ్యం అయ్యారు. ఇంటికి కూడా తాళం వేసి ఉండటంతో, బంధువులతో పాటుగా, స్నేహితులు కూడా కంగారు పడుతున్నారు. పోలీసులు మాత్రం విషయం చెప్పటం లేదు. మరో పక్క జయలక్ష్మి ఇంటి పరిసరాల్లో పోలీసులు మఫ్టీలో తిరుగుతున్నారని, ఎవరినీ ఇంటి వైపు వెళ్ళకుండా చూస్తున్నారని, పోలీసుల పై ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పోలీసులు ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండటంతో, స్థానికులు భయాందోళనలో ఉన్నారు. అయితే రేపు నారా లోకేష్ అనంతపురం వచ్చి, జయలక్ష్మిని పరామరిస్తారనే వార్తల నేపధ్యంలోనే, ఆ కుటుంబాన్ని పోలీసులే దాచేసి ఉంటారని టిడిపి ఆరోపిస్తుంది.

atp 09112021 2

ఇప్పటికే లోకేష్ ఆ విద్యార్ధినితో ఫోన్ లో మాట్లాడిన వీడియో వైరల్ అయ్యింది. రేపు లోకేష్ అనంతపురం వచ్చి, ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే మరింతగా ప్రభుత్వ వ్యతిరేకత వస్తుందని, ప్రభుత్వం భయపడి ఉంటుందని భావిస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో పోలీసులు చెప్తే కానీ తెలియదు. అయితే, పోలీసులు నిన్న చేసిన లాఠీచార్జ్ కు నిరసిస్తూ, ఈ రోజు విద్యార్ధి సంఘాలు బంద్ కు పిలుపు ఇచ్చాయి. బంద్ లో భాగంగా, పోలీసులకు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టే దిశగా విద్యార్ధులు సిద్ధం అయ్యారు. అయితే విద్యార్ధులకు పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ ర్యాలీ చేయకూడదు అనే ఉద్దేశంతో పోలీసులు ఉన్నారు. భారీ ఎత్తున పోలీసులు మొహరించి, విధ్యార్ధులను అడ్డుకుంటున్నారు. ఈ రోజు మళ్ళీ ఉద్రిక్త పరిస్థితి నెలకొంటుంది. శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్ధులను పోలీసులు అడ్డుకుంటున్నారు. రేపు మళ్ళీ నారా లోకేష్ పర్యటన ఉండటంతో, ఈ మొత్తం వ్యవహరం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read