శాంతియుతంగా చేస్తున్న అమరావతి రైతుల మహాపాదయాత్ర విచ్చిన్నం చేసే కుట్రలు జరుగుతున్నాయా ? మహాపాదయాత్రకు వస్తున్న విశేష ఆదరణ చూసి, ప్రభుత్వానికి వణుకు మొదలయ్యిందా ? ఏ అమరావతి ప్రజలను అయితే ఇన్నాళ్ళు బూచిగా చూపి, వివిధ ప్రాంతాల్లో వైషమ్యాలు రెచ్చగొట్టారో, ఇప్పుడు అదే ప్రాంత ప్రజలు అమరావతి రైతులకు మద్దతు తెలుపుతూ ఉండటాన్ని ప్రభుత్వ పెద్దలు జీర్ణించుకోలేక పోతున్నారా ? వీటి అన్నిటి పై అవును అనే సమాధానం చెప్తున్నారు అమరావతి రైతులు. మొదటి రెండు మూడు రోజులు పాదయాత్ర ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగింది. పోలీసులు కూడా ఎక్కడా కలుగచేసుకోలేదు. ప్రశాంత వాతవరణంలో ఎవరికీ ఇబ్బంది లేకుండా ఈ మహాపాదయాత్ర సాగింది. ఎప్పుడైతే ప్రకాశం జిల్లాలోకి పాదయాత్ర అడుగు పెట్టిందో, అప్పటి నుంచి పోలీసులు అడ్డు తగలటం మొదలు పెట్టారు. నిబంధనలు సాకుగా చూపి, హైకోర్టు ఆర్డర్ కు వ్యతిరేకంగా పాదయాత్ర చేస్తున్నారు అంటూ, పోలీసులు అడ్డు తగులుతున్నారు. గత రెండు మూడు రోజులుగా, ప్రకాశం జిల్లాలో ఇదే పరిస్థితి కొనసాగింది. ప్రకాశం పోలీసులు, ఇప్పటికే అమరావతి పరిరక్షణ సమితి జేఏసి నాయకులకు నోటీసులు కూడా ఇచ్చారు. వారం రోజుల్లోగా సమాధానం కూడా చెప్పాలని కోరారు.

amaravati vichhinam 08112021 2

ట్రాఫ్ఫిక్ కు ఇబ్బందులు పెడుతున్నారని, మాస్కులు పెట్టుకోవటం లేదని, 157 మందికి కంటే ఎక్కువ మంది ఉన్నారని, ఇలా అనేక కారణాలు పోలీసులు చెప్తున్నారు. తామేమి అడ్డు తగలటం లేదని, ఎక్కడైనా నిబంధనలు పాటించటం లేదని తెలుస్తుందో, అప్పుడు వచ్చి నోటీసులు ఇస్తున్నాం అని పోలీసులు అంటున్నారు. అయితే అమరావతి రైతులు, మహిళలు మాత్రం, పాదయాత్ర విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతుందని అనుమానం వ్యక్తం చేస్తుంది. ప్రభుత్వం ఏదో కుట్ర చేస్తుందని, దాని కోసమే లేని ఉద్రిక్త పరిస్థితులు కలిగిస్తూ పోలీసులను రంగంలోకి దింపారని అంటున్నారు. ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే వారిని సరి చేసుకుంటాం అని, అంతే కాని ఎన్ని కుట్రలు పన్నినా పాదయాత్ర మాత్రం ఆపం అని అంటున్నారు. పోలీసులు సివిల్ డ్రెస్ లో వచ్చి, వివరాలు అడుగుతున్నారని, మద్దతుగా వస్తున్న వారి ఫోటోలు తీసి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని అమరావతి రైతులు ఆరోపిస్తున్నారు. పాదయాత్రలో జరిగే చిన్న చిన్న విషయాలు కూడా పెద్దవిగా చేసి చూపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా తాము మాత్రం, ఎక్కడా తగ్గేది లేదని అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read