జగన్ అక్రమ ఆస్తుల కేసులు 2012లో ప్రారంభం అయ్యాయి. చాలా కేసుల్లో చార్జ్ షీట్లు కూడా వేసారు. మొత్తం 11 సిబిఐ కేసులు, 5 ఈడీ కేసులు. ఈ కేసులు ఇప్పటికీ, ఒక్క కేసులో కూడా ట్రైల్స్ మొదలు అవ్వలేదు అంటే, ఎంత జాప్యం జరుగుతుందో చూడండి. ఇది ఇంకా సిబిఐ కోర్ట్ లోనే ఉంది. ఇక్కడ తీర్పు వచ్చిన తరువాత హైకోర్టు, అక్కడ నుంచి సుప్రీం కోర్టుకు వెళ్ళాలి అంటే, ఈ కేసు ఎప్పటికి తేలుతుంది ? అసలు తేలుతుందా అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. ఈ కేసులో అనేక మందిని సిబిఐ, ఈడీ నిందితులగా చేర్చింది. ఏ1 గా జగన్ మోహన్ రెడ్డి, ఏ2 గా విజయసాయి రెడ్డి ఉండగా, మిగతా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒక్కొకరూ డిశ్చార్జ్ పిటీషన్ లు వేస్తూ, ఆ పిటీషన్ అని , ఈ పిటీషన్ అని వాయిదా వేస్తూ వస్తున్నారు. ఒకరి తరువాత ఒకరు వేస్తున్నారు. ఇక జగన్ మోహన్ రెడ్డి, శుక్రవారం వచ్చింది అంటే చాలు, ఏదో ఒక కారణం చెప్పటం, వాయిదా ఎగ్గోట్టటం పరిపాటిగా మారిపోయింది. ప్రతి వారం, ఏదో ఒక కారణం. ఇలా ఈ అక్రమ ఆస్తుల కేసులో ఉన్న అందరూ ప్రతి సారి ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటూ, విచారణ వాయిదా వేస్తున్నారు. దీంతో తెలంగాణా హైకోర్టు సీరియస్ అయ్యింది. ఇక నుంచి జగన అక్రమ ఆస్తుల కేసులకు సంబంధించి, వాయిదాలు కోరితే, కోర్టు ఖర్చులు కింద రూ.50 వేలు జమ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేస్తూ, మాటి మాటికీ వాయిదా కోరటం పై అసహనం వ్యక్తం చేసింది.

jagan hc 20112021 2

జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసుల్లో వివిధ పిటీషన్లు కోర్టు ముందుకు వచ్చాయి. తమ పేర్లు కొట్టేయాలని, డిశ్చార్జ్ పిటీషన్లు ఇలా అనేకం జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ బెంచ్ ముందకు వచ్చాయి. అయితే లిస్టు లో ఉన్న ప్రకారం, న్యాయమూర్తి విచారణకు పిలుస్తున్నా ఒక్కరూ రాలేదు. అందరూ వివిధ కారణాలు చెప్పి వాయిదా కోరారు. దాల్మియా సిమెంట్స్‌ న్యాయవాది వాయిదా కోరారు. తరువాత జగన్ మోహన్ రెడ్డి కేసు రాగా, న్యాయవాది రాలేదని వాయిదా కోరారు. ఇలా అందరూ వాయిదా కోరటం, ఇది పరిపాటిగా మారటంతో, నాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మీరు కోరితేనే కదా, విచారణ ఈ రోజు చేసుకుందాం అని అనుకుంది, ఇప్పుడు అందరూ ఏదో ఒక కారణం చెప్పి రాకుండా, కోర్టు సమయం వృధా చేస్తే ఎలా అంటూ అసహనం వ్యక్తం చేసారు. ఇక నుంచి విచారణ సమయానికి వాదనలు వినిపించాలసిందే అనే, లేకపోతే రోజుకు రూ.50 వేల చొప్పున కోర్టు ఖర్చుల కింద జమ చేయాలి అనే ఆదేశాలు ఇస్తామని హెచ్చరిస్తూ, విచారణను వాయిదా వేసారు. ఇక్కడ వీరికి రూ.50 వేలు లెక్క లేకపోయినా, కోర్టు సీరియస్ గా ఉంది అనే విషయం అర్ధం చేసుకోవాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read